BJP is one-man show, two-man army: Sinha బీజేపి వన్ మాన్ షో.. టు మెన్ అర్మీ:సిన్హా

He never said mat jao shatrughan sinha says his decision to quit bjp left advani in tears

Shatrughan Sinha on BJP, Shatrughan Sinha, Shatrughan Sinha on Modi, Shatrughan Sinha vs Ravi Shankar Prasad, Patna Sahib Lok Sabha constituency, Lok Sabha elections 2019, BJP, congress, LK Advani, Shatrughan Sinha, PM Modi, Amit Shah, Rahul Gandhi, National Politics

Congress candidate from Patna Sahib and a former BJP leader Shatrughan Sinha, who has openly criticised the BJP for denying ticket to LK Advani, said the veteran leader had tears in his eyes when he told him about his decision to quit the party.

పార్టీ వీడతున్నానంటే అద్వానీ కన్నీళ్లు కార్చేరే తప్ప..: సిన్హా

Posted: 05/15/2019 02:46 PM IST
He never said mat jao shatrughan sinha says his decision to quit bjp left advani in tears

బీజేపి పార్టీలో రెండు దశాబ్దాల పాటు సేవలందించిన ఆయన.. ప్రస్తుతం కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో పార్టీని వీడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరారు బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా. ఈ సందర్భంగా ఆయన 20 సంవత్సరాల పాటు కొనసాగి పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తరపున పట్నా సాహిబ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ పడుతున్న ఆయన ప్రస్తుతం బీజేపి వన్ మాన్ షో.. టూ మెన్ ఆర్మీగా మారిందని విమర్శించారు. ఈ దశలో అసలు పార్టీ నేతల నిర్ణయాలకు, సూచనలకు, సలహాలకు కూడా విలువ లేదని తన అక్కస్సును వెళ్లగక్కారు.

తాను రెండు దశాబ్దాలుగా కొనసాగిన పార్టీని వీడాలని నిర్ణయించుకున్న తరువాత తనకు రాజకీయ గురువర్యులైన ఎల్కే అద్వానీని కలిశానని, తాను పార్టీని వీడుతున్నానని చెప్పడంతో ఆయన కంటతడి పెట్టుకున్నారే తప్ప, తనను వెళ్లవద్దని మాత్రం చెప్పలేదని అన్నారు. తాను మరో మార్గంలో వెళ్లాలని అనుకుంటున్నట్టు చెప్పి, ఆయన ఆశీస్సులు తీసుకున్నానని, తాను ఇప్పుడు సరైన దారిలోనే వెళుతున్నానని ఆయన అన్నారు. వాజ్ పేయి కాలంలో పార్టీలో చేరిన ఆయన, పార్టీ మారే చివరి రోజుల్లో నిరసన గళం వినిపించిన విషయం తెలిసిందే.

అప్పటి బీజేపీకి, ఇప్పటి బీజేపీకి  ప్రజాస్వామ్యానికీ, నియంతృత్వానికి మధ్య ఉన్నంత తేడా ఉందని, సీనియర్‌ నాయకులకు తగిన గౌరవం లభించడం లేదని శత్రుఘ్నసిన్హా వ్యాఖ్యానించారు. తాను అద్వానీలా మౌనంగా ఉండలేకపోయానని, అందువల్లే బీజేపీకి రాజీనామా చేశానని అన్నారు. బాలాకోట్‌ దాడులను పదేపదే ప్రస్తావించడం బీజేపీ చేస్తున్న తప్పని, ప్రతి భారతీయుడికీ జాతీయభావం ఉందని, బీజేపీ నాయకులు తమకు మాత్రమే ఉందన్నట్టు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారని, మమతా బెనర్జీ వ్యాఖ్యానించినట్టు మోదీకి రాజకీయాల్లో కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  congress  LK Advani  Shatrughan Sinha  PM Modi  Amit Shah  Rahul Gandhi  National Politics  

Other Articles