Metro stations can be used as foot over bridge ఇకపై మెట్రో స్టేషన్లు.. ఫుట్ ఓవర్ బ్రిడ్జి సేవలు..

Good news to pedestrians now cross road using metro stations

Metro stations can be used as foot over bridge, pedestrians can cross road using Metro stations, Metro Train, Metro stations, foot over bridge, pedestrians, begumpet, parade grounds, Hyderabad, Telangana

Here is the good news to hyderbad pedestrians, who are crossing roads always keeping their life in risk, metro officials said in a new press release that, pedestrians can cross road using Metro stations 1st floor except at begumpet and parade grounds.

ఇకపై మెట్రో స్టేషన్లు.. ఫుట్ ఓవర్ బ్రిడ్జి సేవలు..

Posted: 05/13/2019 04:32 PM IST
Good news to pedestrians now cross road using metro stations

మెట్రో రైలు ప్రారంభమైన నేపథ్యంలో రైల్వే స్టేషన్ లోకి వెళ్లడానికి కూడా కాసులు కావాల్సిందేనన్న అంక్షలు వినిపించాయి. దీంతో ఈ స్టేషన్లలోని మెట్టు, లిప్టు; ఎస్కలేటర్లు వినియోగించుకుని.. రోడ్డుకు అటుపైవుకు వెళ్లేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. అయితే ఇలా రోడ్డు క్రాస్ చేయాల్సి వచ్చిన ప్రతీసారి నగరవాసులు అనేక ఇబ్బందులు పడ్డారు. రొడ్డు దాటాలంటే శరవేగంగా వస్తున్న వాహనాలను దాటుకుంటూ రోడ్డు క్రాస్ చేయాల్సి వస్తుండటంతో పలువురు ప్రమాదాల బారిన కూడా పడుతున్నారు.

ఆ మధ్య నగరంలో అక్కడక్కడా కనిపించిన పాదచారుల వంతెనలు మెట్రో రైలు స్టేషన్ల నిర్మాణంతో పాటు మార్గం నిర్మించడంలో తొలగించాల్సి వచ్చింది. దీంతో ఇక పాదచారులు రోడ్డు క్రాస్ చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇక మైట్రో రైల్వే అధికారులు కూడా ఒక చక్కటి నిర్ణయానికి వచ్చారు. మెట్రో రైలు ప్రయాణికులకు మాత్రమే గత ఏఢాదిగా సేవలందిస్తున్న నగరంలోని మెట్రో స్టేషన్లు.. ఇకపై పాదచారులు రోడ్డు దాటలానికి కూడా వినియోగించుకోవచ్చు. పాదాచారుల వంతెనలు లేకపోయినా మెట్రో స్టేషన్లను సైతం అలాగే ఉపయోగించుకోవచ్చు.

పలు స్టేషన్ల ఎదుట మెట్రో స్టేషన్‌ను ఉపయోగించుకోండి అంటూ బోర్డులు పెడుతున్నారు. మహానగరంలో అనేక ప్రధాన కూడళ్ల వద్ద సిగ్నల్ లేకుండా ప్రయాణం సాగించే విధంగా ట్రాఫిక్ అధికారులు చర్యలు తీసుకున్నారు. చౌరస్తా వద్ద యూ టర్న్ విధానాన్ని అమలు చేశారు. దీనితో రయ్యి రయ్యి మంటూ వాహనాలు వెళుతున్నాయి. అయితే..రోడ్డు దాటాలంటే పాదాచారులు భయపడిపోతున్నారు. వీరి కష్టాలు పెరిగిపోయాయి. కొన్ని సార్లు వాహనాలు ఢీకొని పలువురు గాయపడుతున్నారు కూడా.

మెట్రో నిర్మాణానికి ముందు కూకట్ పల్లి, అమీర్ పేట, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల్లో పాదాచారుల వంతెనలుండేవి. వీటిని తొలగించారు. రోడ్డు మధ్యలో మొదటి, రెండు అంతస్థులను మెట్రో స్టేషన్లను నిర్మించారు. మొదటి అంతస్తు వరకు ఫ్రీగానే వెళ్లవచ్చు. నాలుగు వైపుల నుండి లిఫ్ట్‌లు, మెట్లు, ఎస్కలేటర్లున్నాయి. వీటిని ఉపయోగించి స్టేషన్ మొదటి అంతస్తు నుండి మరోవైపుకు దిగవచ్చు. ఇలా రెండు దిక్కుల్లోనూ అవకాశం ఉంది. బేగంపేట, పరేడ్ గ్రౌండ్స్ స్టేషన్లు మినహా అన్ని స్టేషన్లు రోడ్డు దాటేందుకు ఉపయోగించుకోవచ్చు. సో..మెట్రో స్టేషన్లను సైతం పాదాచారుల వంతెనలుగా ఉపయోగించుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Metro Train  Metro stations  foot over bridge  pedestrians  begumpet  parade grounds  Hyderabad  Telangana  

Other Articles