IAF gets first Apache Guardian attack helicopter వాయుసేన అమ్ములపోదిలో మరో అస్త్రం..!

Air force gets its first apache attack helicopter at boeing plant in us

Apache Guardian, Indian Air Force, AH 64E Apache Guardian, Apache attack helicopter, Apache Helicopter, IAF, Apache Helicopter India, Apache Helicopter India Deal, Apache Helicopter Cost

The first Apache Guardian attack helicopter was formally handed over to the Indian Air Force at a production facility of Boeing in Arizona on Friday, the Indian Air Force tweeted

‘అపాచీ’.. వాయుసేన అమ్ములపోదిలో అగ్రరాజ్య అస్త్రం!

Posted: 05/11/2019 04:31 PM IST
Air force gets its first apache attack helicopter at boeing plant in us

భారత వాయుసేన అమ్ములపొదిలో ఓ కీలక అస్త్రం చేరింది. అగ్రరాజ్యం అమెరికాకు ఎన్నో ఏళ్లుగా విశిష్టరీతిలో సేవలు అందిస్తున్న అస్త్రం ఇకపై భారత్ వాయుసేనలో భాగం కానుంది. అదే అపాచీ.. ఎంతటి క్లిష్ట వాతావరణంలోనైనా శత్రుసేనలపై అటాకింగ్ హెలికాప్టర్లు ఇవి. అపాచీ యుద్ద హెలికాప్టర్లు ఇకపై భారత్ వాయుసేనలో కూడా తమ ప్రాభవాన్ని చాటనున్నాయి. 2015లో అమెరికా, భారత్ మధ్య 22 అపాచీ హెలికాప్టర్ల విక్రయానికి ఒప్పందం కుదరగా, భారత్ కు తొలి అపాచీ గార్డియన్ అటాక్ హెలికాప్టర్ ను అప్పగించారు.

ఆరిజోనాలోని బోయింగ్ సంస్థ ఉత్పత్తి కేంద్రంలో ఈ అపాచీ హెలికాప్టర్ ను ఎయిర్ మార్షల్ ఏఎస్ బుటోలాకు అందజేశారు. ఈ మేరకు భారత వాయుసేన ట్వీట్ చేసింది. భారత వాయుసేన అమ్మలపోదిలోకి అగ్రరాజ్యానికి చెందిన అపాచీ యుద్ద హెలికాప్టర్ల్ వచ్చిందని పేర్కోంది. అపాచీ యుద్ద హెలికాప్టర్ ప్రత్యేకలను కూడా చూచాయగా తెలిపుతూ.. ఇవి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనై ప్రత్యర్థులపై దాడులు చేయగలవు. గగనతలం, భూతలం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోగల సత్తా అపాచీ హెలికాప్టర్లకు ఉంది అని ట్వీట్ చేసింది.

ఒక్కసారి యుద్ధరంగంలో దిగిన తర్వాత అందుబాటులో ఉన్న డేటా నెట్వర్కింగ్ వ్యవస్థల నుంచే కాకుండా, ఇతర ఆయుధ వ్యవస్థల నుంచి కూడా స్వయంగా సమాచారం సేకరించడం, ఇతర వ్యవస్థలకు చేరవేయడం అపాచీ హెలికాప్టర్లకు మాత్రమే ఉండే ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం. చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ రాడార్లను బోల్తా కొట్టించే స్టెల్త్ పరిజ్ఞానాన్ని ఈ హెలికాప్టర్లలో పొందుపరిచారు. తక్కువ ఎత్తులో ప్రయాణించేటప్పుడు చెట్లకు, రాళ్ల గుట్టలకు తగలకుండా ఉండే విధంగా దీని రూపురేఖలు డిజైన్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles