Alanda media takes over ABCL TV-9 group ఏబిసీఎల్ టీవీ9ను టేకేవర్ చేసిన అలంద మీడియా

Alanda media entertainments takes over abcl tv 9 group of channels

TV9 Telugu channel, alanda media, ABCL, Mahendra Mishra, new CEO of TV9, Mahendra Mishra Tv9, ravi prakash, gottipati singa rao, TV9 telugu COO, Tv 9 sambasiva rao, alanda media kaushal RaoTV9 Telugu channel, alanda media, ABCL, Mahendra Mishra, new CEO of TV9, Mahendra Mishra Tv9, ravi prakash, gottipati singa rao, TV9 telugu COO, Tv 9 sambasiva rao, alanda media kaushal Rao

Alanda media entertainments takes over Associated broadcasting limited's TV-9 group of channels, they had taken even the managment into their control. By this Ravi Prakash had lost the control over TV9 managment and replaced by Mahendra mishra.

ఏబిసీఎల్ టీవీ9ను టేకేవర్ చేసిన అలంద మీడియా

Posted: 05/10/2019 08:15 PM IST
Alanda media entertainments takes over abcl tv 9 group of channels

టీవీ9 యాజమాన్యం ఇవాళ్టి నుంచి అధికారికంగా తాము టేకోవర్ చేసుకున్నామని ఏబిసిఎల్ డైరెక్టర్ల ఒకరైన సాంబశివరావు తెలిపారు. ఈ మేరకు ఏబీసీఎల్ బోర్డు తరపున మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన టీవీ9లో తాము నలుగురు డైరెక్టర్లుగా వ్వవహరిస్తున్నామని చెప్పారు. తాము తొమ్మిది నెలల క్రితం అధికారికంగా ఏబిసిఎల్ లోని 90.5శాతం వాటాను కొనుగోలు చేశామని, ఆ తరువాత డైరెక్టర్లుగా నియమించకోవడంలో అనేక అవాంతరాలను ఎదుర్కోన్నామని అన్నారు. కాగా, వాటిన్నింటినీ అధిగమించి ఇవాళ టీవీ9 యాజమాన్యాన్ని కూడా తాము తమ అధీనంలోకి తీసుకున్నామన్నారు.

టీవీ9 వివాదం విషయమై ఈ బోర్డు తీసుకున్న కొత్త నిర్ణయాలను ప్రకటించారు. ఏబీసీఎల్ కంపెనీ ప్రతినిధులు. టీవీ9లో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చేందుకు అలందా మీడియా సంస్ధ మేనేజ్‌మెంట్.. అలందా మీడియా కలిసి సంయుక్తంగా సమావేశం నిర్వహించింది. సాంబశివరావు, జగపతిరావ్, శ్రీనివాస్, కౌశీక్‌ను డైరెక్టర్లుగా నియమితులయినట్లు బోర్డ్ డైరెక్టర్‌లలో ఒకరైన సాంబశివరావు  వెల్లడించారు. అయితే ఏబీసీఎల్ మేనేజ్‌మెంట్ తమ నియామకానికి సంబంధించిన అనుమతులను ఆలస్యం చేసిందని అరోపించారు.

తమ నియామక పత్రాలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు ఆలస్యంగా పంపారని సాంబశివరావు అన్నారు. మార్చిలో ఇందుకు సంబంధించిన అనుమతి లభించిందని తెలిపారు సాంబశివరావు. బోర్డు మీటింగ్ పెట్టమని మూర్తిని, రవిప్రకాశ్‌ని అనేకమార్లు కోరాం అని అయితే వాళ్లు పెట్టలేదని సాంబశివరావు అన్నారు. రవిప్రకాశ్‌ని మూర్తిని వారి స్థానాల నుంచి తొలగించామని, టీవీ9 కన్నడ సీఈఓగా మహింద్ర మిశ్రాను, సీఓఓగా గొట్టిపాటి సింగారావును నియమించినట్లు తెలిపారు. అలాగే కంపెనీలో ఎవరైనా అవకతవకలు చేసి ఉంటే మేనేజ్‌మెంట్ చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TV9 Telugu channel  alanda media  ABCL  Tv 9 sambasiva rao  kaushal Rao  Ravi prakash  

Other Articles