IMD issues Heat wave warning in Telugu states రానున్న మూడు రోజులు భయటకు రాకండీ.. వాతావరణ హెచ్చరికలు

Imd issues heat wave warning in telugu states for next 72 hours

India Meteorological Department, heat wave, weather-report, warning, summer, on-april-27-28, heatwave, telangana, Andhra Pradesh

The Indian Meteorological Department (IMD) has issued a heat wave warning in Telangana for comming three days. Heat wave may continue up till 10th. According to IMD, heat wave conditions are likely to prevail over Telugu state.

రానున్న మూడు రోజులు భయటకు రాకండీ.. వాతావరణ హెచ్చరికలు

Posted: 05/10/2019 01:31 PM IST
Imd issues heat wave warning in telugu states for next 72 hours

ప్రచండ భానుడి ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైబడి నమోదవుతున్నాయి. ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతల తీవ్రతతో భానుడు భగభగ మండుతున్నాడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, రానున్న మూడు రోజుల పాటు ఎండలు మరింత తీవ్రంగా వుంటాయని అధికారులు భారత వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ఎండలో తిరగడం మంచిది కాదని, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఎండలు ధాటికి తెలుగు రాష్ట్రాల్లో మరణాలకు కూడా సంభవిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే భానుడి ప్రతాపానికి రెండు రాష్ట్రాల్లో 16 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎండ తీవ్రత ఈరోజు, రేపు కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్రమైన వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది. ఇదే సమయంలో ఒక చల్లటి కబురు అందించింది. రానున్న నాలుగు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.  

కాగా, నేడు, రేపు, ఎల్లుండి ఎండల తీవ్రతతో పాటు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తత జారీ చేశారు. చిన్నారులు, వృద్ధులు బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. రోహిణి కార్తె రాకముందే ఎండలు ఈ స్థాయిలో ఉన్నాయంటే.. ఇక కార్తె వచ్చినప్పుడు ఉష్ణోగ్రతలు ఎంతలా పెరుగుతాయన్న అందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇక ఖమ్మంలో 45.6 డిగ్రీలు, గుబ్బగుర్తి, సత్తుపల్లిలో 46.1, ఏన్కూరు, తిమ్మారావుపేటలో 45.7, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 46, జయశంకర్‌ జిల్లా మల్లూరులో 45.8, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో 45.7, నల్గొండలో 44.8, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లో 43.8, హైదరాబాద్‌లో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles