Are Ravi Prakash, Hero Shivaji targeted by alanda media టీవీ9లో అసలేం జరుగుతుందీ.? రవిప్రకాష్ ను తప్పించడానికేనా.?

Are ravi prakash hero shivaji targeted by alanda media

Ravi Prakash revomed as TV9 CEO, case filed on Ravi Prakash, forgery case on Ravi Prakash, notices to Hero sivaji, Hero sivaji, Ravi Prakash, Alanda Media company, Kaushik Rao, forgery case, TV9 CEO, ABCL, new directors, cybercrime cops, Telangana, Andhra Pradesh, Politics

How Telangana cyber crime police can made searches in Ravi Prakash house and his chamber at TV9 office, Is it with the bigger heads of the government who bought pressure on the police, as such many questions araise in the people of telugu states.

టీవీ9లో అసలేం జరుగుతుందీ.? రవిప్రకాష్ ను తప్పించడానికేనా.?

Posted: 05/09/2019 05:14 PM IST
Are ravi prakash hero shivaji targeted by alanda media

టీవీ9 ఛానెల్ సీఈవో రవిప్రకాష్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు రవిప్రకాష్ తోనేగా టీవీ9 ఓ గుర్తింపును సాధించింది. మరీ అలాంటి రవిప్రకాష్ ను టీవీ9 సీఈవోగా ఎందుకు తొలగిస్తారు.. అన్న ప్రశ్నలు సర్వత్రా తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. 2003 నుంచి ఈ ఛానెల్ కు సీఈవోగా వ్యవహరిస్తున్న రవిప్రకాష్ నేతృత్వంలో వచ్చిన తొలి తెలుగు సంపూర్ణ వార్త స్రవంతి టీవీ9. తెలుగు రాష్ట్ర ప్రజల మన్నలను కూడా సాధించిన.. ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటిన ఛానెల్ గా గుర్తింపును పోందింది.

తెరముందు ప్రజాసమస్యలను, ఎప్పటికప్పుడు వార్తవిశేషాలను తీసుకువచ్చే టీవీ9 వెనుక అసలేం జరిగుతుందన్న అసక్తి సర్వత్రా నెలకొంది. రవిప్రకాష్ విషయంలో అసలేం జరుగుతొంది. ఛానెల్ లో వాటా వున్న సీఈవోను ఎలా ఆ పదవి నుంచి తొలగిస్తారు.? కంపెనీ పరిణామాల నేపథ్యంలో అసలు పోలీసులు జోక్యం ఏమిటీ.? రవిప్రకాష్ చుట్టూ కావాలనే పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారా.? అతనిపై కావాలనే కేసులు బనాయిస్తున్నారా.? అందుకు పోలీసులపై తెరవెనుకగా ఒత్తిడి తీసుకువస్తున్న వ్యక్తులెవరు.? కంపెనీలకు సంబంధించిన వ్యవహారాలన్నింటీలోనూ పోలీసులు ఇదే విధంగా డీల్ చేస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఒక ప్రైవేటు కంపెనీకి సంబంధించిన యాజమాన్యం, సీఈవోల మధ్య నడుస్తున్న వ్యవహారంలో పోలీసుల ప్రమేయం ఎందుకు.? వారు నోటీసులు ఎందుకు ఇచ్చారు.? వారిని తమ ఎదుట ఎందుకు హాజరుకావాలని పేర్కోన్నారు. అన్న ప్రశ్నలు సగటు మీడియా జర్నిలిస్టులతో పాటు వార్తలపై అవగాహన కలిగిన యావత్ తెలుగు ప్రజలలో రేకెత్తుతుంది. అయినా ప్రైవేటు కంపెనీల వ్యవహారాలను న్యాయస్థానంలో తేల్చుకోవాల్సిందిగా సూచించాల్సిన పోలీసులు.. సోదాలు చేయడం, నోటీసులు అందజేయడం వెనుక అసలు కథ మరేదైనా వుందా.? ప్రభుత్వ పెద్దల నుంచే పోలీసులకు ఇలాంటి అదేశాలు జారీ అయ్యాయా.? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి.

టీవీ9 ఛానెల్ ను కొనుగోలు చేసిన నూతన యాజమాన్యం.. రవి ప్రకాష్ ను సీఈవో బాధ్యతల నుంచి తప్పించేందుకే ఇలాంటి అడుగులు వేసిందా.? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇవాళ ఉదయం రవిప్రకాష్ టీవీ9 సంస్థలోని కీలక ఉద్యోగి సంతకాన్ని పోర్జరీ చేసి.. కంపెనీ నూతన యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలకు అడ్డుకుంటున్నాడన్న అరోపణలతో ఆయన ఇంటితో పాటు.. టీవీ9 కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు పోలీసులు. దీంతో అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు.. రవిప్రకాష్ పై ఫిర్యాదు చేశాడంతోనే తాము సోదాలు నిర్వహించామన్నారు పోలీసులు.

అసలు టీవీ9 పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టీవీ9 పేరుతో తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ, ఇంగ్లీషు, హిందీ ఛానళ్లు నిర్వహిస్తున్న అసోసియేటెడ్‌ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్‌)ను వ్యాపారవేత్త శ్రీనిరాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐల్యాబ్స్ వెంచర్ కేపిటల్ ఫండ్ కలిపి ప్రారంభించాయి. ఏబీసీఎల్‌ కంపెనీలో ఈ రెండు సంస్థలకు కలిపి 90 శాతానికి పైగా వాటా ఉండగా, ఆ సంస్థలో ఓ ఉద్యోగిగా చేరి సీఈవో, డైరెక్టర్‌గా హోదా పొందిన రవిప్రకాశ్, ఆయన అసోసియేట్స్‌కు సంస్థలో దాదాపు 8 శాతం వాటా ఉంది.

ఏబీసీఎల్‌లో 90 శాతానిపైగా వాటా ఉన్న రెండు సంస్థల నుంచి ఆ వాటాను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ కు చెందిన అలందా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆగస్టు 23, 2018న ఒప్పందం కుదుర్చుకుని ఆ తరువాతే ఒకటి రెండు రోజుల్లో చెల్లింపులు కూడా పూర్తి చేసింది. దీనికి అనుగుణంగానే ఆ షేర్లు మొత్తం కూడా అలందా మీడియా పేరు మీద ఆగస్టు 27వ తేదీన డి-మ్యాట్ రూపంలో బదిలీ అయ్యాయి. దీంతో ఏబీసీఎల్ యాజమాన్యం అలందా చేతికి మారినట్లయ్యింది.

ఈ లావాదేవీని గుర్తిస్తూ, ఏబీసీఎల్ కంపెనీ తన రికార్డుల్లో నమోదు కూడా చేసుకుంది. సంబంధిత పత్రాలను రిజిస్ట్రార్ ఆఫ్‌ కంపెనీస్‌ కార్యాలయంలో దాఖలు కూడా చేశారు. ఏబీసీఎల్ యాజమాన్యం చేతులు మారడంతో అలందా మీడియా సంస్థ తరపున నలుగురు డైరెక్టర్లను ఏబీసీఎల్ డైరెక్టర్ల బోర్డులో నియమించేందుకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అనుమతి కోరుతూ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు అధికారికంగా పంపించింది. ఈ తీర్మానాల మీద ఒకసారి రవిప్రకాశ్, మరోసారి ఎంకెవీఎన్ మూర్తి అనే మరో డైరెక్టర్ ఏబీసీఎల్ డైరెక్టర్ల హోదాలో సంతకాలు చేశారు.

ఈ దరఖాస్తును పరిశీలించిన కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మార్చి 29, 2019న అనుమతి మంజూరు చేస్తూ ఏబీసీఎల్కు సమాచారం పంపింది. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ, కొత్త డైరెక్టర్లతో బోర్డు మీటింగ్ నిర్వహించేందుకు రవిప్రకాశ్ శతవిధాలా అడ్డుపడుతూ వచ్చారు. దీంతో ఏబీసీఎల్లో 90 శాతానికి పైగా వాటా పొందిన అలందా మీడియాకు చెందిన నలుగురు డైరెక్టర్లు ఏప్రిల్ 23, 2019న సమావేశమై తమ నియామకానికి చెందిన పత్రాలను రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కార్యాలయంలో దాఖలు చేయాల్సిందిగా ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న కంపెనీ సెక్రటరీని కోరారు.

రవిప్రకాశ్, ఆయన సహచరులు కొందరు దీన్ని అడ్డుకునే దురుద్దేశంతో, ఆ కంపెనీ సెక్రటరీ రాజీనామా చేసినట్లు పాత తేదీతో ఫోర్జరీ డాక్యుమెంట్ ను సృష్టించారు. ఇదే విషయాన్ని సదరు కంపెనీ సెక్రటరీ రాతపూర్వకంగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు ఫిర్యాదు చేయడమే కాక, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తాను రాజీనామా చేసినట్లు నకిలీ పత్రాన్ని సృష్టించారని వివరించారు. కంపెనీలో 90 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యానికి ఆ కంపెనీ నిర్వహణలో అడుగడుగునా అడ్డుపడుతూ, కంపెనీల చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కొత్త యాజమాన్యం ఆరోపించింది.

మెజార్టీ వాటాదారుల హక్కులను అణగదొక్కే విధంగా కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారంటోంది అలందా మీడియా. సంస్థ నిర్వహణకు సంబంధించి రవిప్రకాశ్ పాల్పడిన అక్రమాలపై టీవీ9 యాజమాన్యం అతనిపై చీటింగ్ కేసు కూడా పెట్టింది. సంస్థకు హాని కలిగించే ఉద్దేశంతో కొందరు వ్యక్తులతో కుమ్మక్కై ఫోర్జరీ పత్రాలు సృష్టించడమే కాక, కంపెనీ నిర్వహణలో యాజమాన్యానికి ఇబ్బందులు కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతోనే పోలీసులు రవిప్రకాష్ నివాసంతో పాటు కార్యాలయంపై కూడా సోదాలు నిర్వహించారు. ఆ తరువాత నోటీసులు జారీ చేసిన తమ ఎదుట హాజరుకావాలని అదేశించారు.

కాగా, టీవీ9లో తాను మైనార్టీ షేర్ హోల్డర్ నని... తనకు తెలియకుండానే తన షేర్లను అమ్మేశారని హీరో శివాజీ అరోపించారు. ఈ నేపథ్యంలో తనను అజ్ఞాతంలో వుంచి కంపెనీకి చెందిన షేర్లను విక్రయించడంపై తాను ఇప్పటికే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ను ఆశ్రయించానని అన్నారు. ఈ నేపథ్యంలో, టీవీ9 వాటాలను కొనవద్దని ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని కూడా చెప్పారు. అయితే ట్రైబ్యూనల్ అదేశాలు అమల్లో ఉండగానే అలంద మీడియా యాజమాన్యం టీవీ 9ను కొనేసింది. అంతేకాదు ట్రైబ్యూనల్ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ యాజమాన్యం కూడా బదిలీ కావడం గమనార్హమన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles