love couple thank ahmedabad police for e-challan పోలీసుల థ్యాంక్స్ చెప్పిన జంట.. ఈ-చలానాతో పెళ్లికి పచ్చజెండా..

Traffic police e challan helps open up ahmedabad lovers relationship

Traffic police, e-challan, Ahmedabad, converts, lover couple, Marriage, Viral, buzz, trend, trending, Social media, Facbook

I got a memo by mail today and the funniest thing happened , in the pic of the memo was me and my gf ( which my parents don’t know about ) now they do. Thanks guys due to this memo now my parents know about my relationship

పోలీసుల థ్యాంక్స్ చెప్పిన జంట.. ఈ-చలానాతో పెళ్లికి పచ్చజెండా..

Posted: 05/04/2019 06:54 PM IST
Traffic police e challan helps open up ahmedabad lovers relationship

ప్రేమ జంట తమ ప్రేమను పెద్దలకు చెప్పి ఒప్పించాలంటే ఎలా ప్రారంభం చేయాలి.. అది ఎక్కడ ముగుస్తుందో తెలియక తటపటాయిస్తుంటారు. కొందరు ప్రేమికులు తమ ఇంట్లో పెద్దలు ప్రేమను అంగీకరించరని విపరీత చర్యలకు కూడా తెగబడుతుంటారు. అయితే ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఈ జంటను ఒక్కటయ్యేలా చేశారు. అదేంటి పెద్దలను ఎదురించిన ప్రేమికులకు సివిల్ పోలీసులు పెద్దలతో చర్చించి పెళ్లిళ్లు చేస్తారు కానీ.. ఇక్కడ ట్రాఫిక్ పోలీసుల ప్రేమజంటను ఎలా ఒక్కటయ్యేలా చేశారనేగా మీ అనుమానం.

ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారి ఇంటికి ట్రాఫిక్ పోలీసులు ఈ- చలానాలు పంపడం తెలిసిందే. ఇలా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో కూడా ట్రాఫిక్ పోలీసులు పంపిన ఈ- చలానా ఒక ప్రేమ జంటను ఇంటివారిని చేసింది. వివరాల్లోకి వెళితే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పారేఖ్ అనే యువకుని ఇంటికి చలానా వచ్చింది. దానిపై ఆ యువకుని ఫొటో ఉంది. అలాగే అతని బైక్ పైన కూర్చున్న అతని ప్రియురాలు కూడా కనిపిస్తోంది.

పారేఖ్ ఇంట్లోని వారు అతనిని నిలదీయగా ఆమెతో రిలేషన్ ఉందని తెలిపాడు. తామిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని చెప్పాడు. దీంతో పారేఖ్ తల్లిదండ్రులు ఆ యువతి ఇంటికి వెళ్లి, ఆమె తల్లిదండ్రులను కలిశారు. ఇరువర్గాల సమ్మతితో వారికి వివాహం నిశ్చయించారు. తనకు ఇటువంటి ట్రాఫిక్ చలానా అందిన నేపధ్యంలో పారేఖ్ అహ్మదాబాద్ పోలీసులకు ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపాడు పారేఖ్. అయితే తాను రెడ్ లైన్ దాటానని ట్రాఫిక్ పోలీసులు భావించారు.. కానీ వాస్తవానికి తాను వైట్ లైన్ వద్దే వున్నానని, నిబంధలను ఉల్లంఘించలేదని కూడా తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Traffic police  e-challan  Ahmedabad  converts  lover couple  Marriage  Viral  buzz  trend  trending  Social media  Facbook  

Other Articles