3 militants killed in Shopian gunfight హిజ్బుల్ ఉగ్రవాది లతీఫ్ టైగర్ ను హతమార్చిన ఆర్మీ

Shopian encounter 3 hizbul mujahideen terrorists killed

Lateef Tiger, Burhan Wani's group, Hizbul Mujahideen, Kashmir separatist movement, Jammu and Kashmir, Kashmir, Kashmiri militants, Kashmiri people, Terrorism in Jammu and Kashmir, Kashmir conflict, Hizbul Mujahideen, Sameer Tiger, Indian Army operations in Jammu and Kashmir, Kashmir valley, Police S.P., Pani, Tariq, Politics

Three militants of Hizbul Mujahideen (HM) including one of the longest surviving militant of Burhan Wani's group, were killed in a gunfight with the government forces in a village in south Kashmir's Shopian district.

హిజ్బుల్ ఉగ్రవాది లతీఫ్ టైగర్ ను హతమార్చిన ఆర్మీ బలగాలు

Posted: 05/04/2019 11:32 AM IST
Shopian encounter 3 hizbul mujahideen terrorists killed

జమ్మూకశ్మీర్ లోని కాశ్మీర్ వేర్పాటు వాద ఉగ్రవాద గ్రూపుకు నూకలు చెల్లిపోయాయి. భద్రతాదళాలలకు, ఉగ్రవాద మూకలకు మధ్య జరిగని ఎన్ కౌంటర్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. కాశ్మీర్ వేర్పాటు వాదంతో వేళ్లూనుకుని పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజ్ బుల్ ముజాహిద్దీన్ కు చెందిన ఆఖరు గ్యాంగ్ స్టర్ బుర్హాన్ వనీ గ్యాంగ్ లో ఆఖరువాడైన లతీఫ్ టైగర్ ను ఈ ఎన్ కౌంటర్లో హతమర్చాయి బధ్రతా బలగాలు. అరేళ్లుగా లతీఫ్ టైగర్ కోసం అన్వేషిస్తున్న బలగాలు ఎట్టకేలకు హతమార్చాయి.

దీంతో బుర్హన్ వనీ నేతృత్వంలోని 11 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు సైన్యం తెలిపింది. ఈ మేరకు ఓ ఫొటోను విడుదల చేసింది. జమ్ముకశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాలోని ఇమామ్‌ సాహెబ్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారు. ఈ సమాచారాన్ని అందుకున్న సైన్యం దాడులు జరిపింది. చుట్టుముట్టిన సైన్యాన్ని చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మూడేళ్ల క్రితం జరిగిన ఎదురుకాల్పుల్లో హతమైన హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ అనుచరుడు, కమాండర్ లతీఫ్ టైగర్ కూడా మృతుల్లో ఉన్నట్టు అధికారులు ధృవీకరించారు.

వనీ గ్యాంగులో మొత్తం 11 మంది ఉగ్రవాదులు ఉండగా, తాజాగా లతీఫ్ ను మట్టుబెట్టడంతో మొత్తం గ్యాంగ్ తుడిచిపెట్టుకుపోయినట్టు అయింది. జూన్, 2015లో ఈ గ్యాంగ్‌లోని ఉగ్రవాదులందరూ కలిసి ముఖానికి మాస్క్ లేకుండా తీయించుకున్న ఫొటో అప్పట్లో వైరల్ అయింది. ఆ తర్వాత సైన్యం చేతిలో 10 మంది హతమవగా, తాజాగా లతీఫ్ టైగర్ కూడా హతమవడంతో గ్యాంగ్ కథ ముగిసింది. ఇతడి కోసం ఆరేళ్లుగా ఎదురుచూస్తున్నట్టు సైనికాధికారి ఒకరు తెలిపారు. మిగతా ఇద్దరిని తారిక్ మౌల్వి, షారిక్ అహ్మద్‌గా గుర్తించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles