Pakistan starts action against JeM chief Masood Azhar అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజహర్ పై చర్యలు షురూ..!

Pakistan orders freezing of assets of masood azhar ban on travel

JeM, Pulwama terror attack, Masood Azhar, Masood Azhar terrorist, UN global terrorist list, Jaish e mohammed, Jaish Taliban nexus, Indian dossier on Jaish, Jaish e mohammed, Masood Azhar, Azhar Masood

Pakistan has issued an official order to freeze the assets of and impose a travel ban on terror outfit Jaish-e-Mohammed (JeM) chief Masood Azhar after the United Nations declared him a “global terrorist”.

అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజహర్ పై చర్యలు షురూ..!

Posted: 05/03/2019 04:53 PM IST
Pakistan orders freezing of assets of masood azhar ban on travel

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ముద్రవేసిన నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయనపై చర్యలను తీసుకునేందుకు ఉపక్రమించింది అక్కడి ప్రభుత్వం. ఇనాళ్లు తాము పెంచి పోషించిన ఉగ్రనేతపై తామే చర్యలు తీసుకోవాల్సిన వస్తున్న తరుణంలో తమ బాధను బయటకు వ్యక్తంకానీయని పాకిస్థాన్ ప్రభుత్వం.. ముందస్తుగా అతనికి చెందిన అస్తులను జప్తు చేసేందుకు అదేశాలు జారీ చేశారు.

మసూద్ అజహర్ ఎటువంటి ఆయుధాల కొనుగోలు, అమ్మకాలు జరపరాదని ఆంక్షలు విధిస్తూ, అధికారిక నోటిఫికేషన్‌ ను పాకిస్థాన్ విడుదల చేసింది. ఆంక్షల కమిటీ విధించే నిబంధనలకు అనుగుణంగా మసూద్‌ పై చర్యలు ఉంటాయని ఈ నోటిఫికేషన్ లో పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఆయన విదేశీ ప్రయాణాలపైనా నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. భద్రతా మండలి నిర్ణయాన్ని తాము ఆమోదిస్తున్నామని, నిబంధనల మేరకు ఆంక్షలను తక్షణమే అమలు చేయనున్నామని పేర్కొంది.

కాగా, మసూద్ ను ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా ప్రకటించాల్సిందేనంటూ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాలు భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. చైనా కూడా అభ్యంతరం తెలపకపోవడంతో రెండు రోజుల క్రితం మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆ తరువాత ఆయన ఇస్లామాబాద్ లోనే ఓ రహస్య భవనంలో అత్యంత సురక్షింతగా తలదాచుకున్నాడని భారత నిఘావర్గాలు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా పాక్ ఆయనపై అంక్షలను విధించడం కీలక పరిణామాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles