Election commission lifts code of conduct in Andhra Pradesh ‘ఫణి’ సహాయక చర్యల కోసం 4 జిల్లాల్లో కోడ్ తొలగింపు

Election commission lifts code of conduct in andhra pradesh

IMD, Andhra cyclone alert, IMD cyclone alert, election code, Election commission, East godavari, vishakapatnam, srikakulam, vizianagaram, Andhra pradesh fani storm, Andhra pradesh Weather, Andhra pradesh fani, Andhra pradesh storm, Andhra pradesh cyclone alert, Andhra pradesh fani alert, Cyclone Fani, Fani

" After Cyclone Fani has moved away from Andhra Pradesh, showing impact on nearly 4 district of Coastal Andhra, Election commission had lifted the election code in East godavari, vishakapatnam, srikakulam, vizianagaram districts to carry away rescue operations.

‘ఫణి’ సహాయక చర్యల కోసం 4 జిల్లాల్లో కోడ్ తొలగింపు

Posted: 05/03/2019 01:35 PM IST
Election commission lifts code of conduct in andhra pradesh

ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతవాసులకు గత వారం రోజులుగా భయాందోళనకు గురిచేసిన భీకరఫెను తుఫాను ‘ఫణి’ అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లకల్లోలం చేసి.. తన విలయతాండవంతో పెను బీభత్సాన్ని సృష్టిస్తూ ఒడిశాలోని పూరి వైపు దూసేకెళ్లింది. ఈ క్రమంలో ఫణి తుపాను ప్రభావంతో అతలాకుతలమైన తీరప్రాంతంలో సహాయక చర్యలు అందించేక్రమంలో కేంద్ర ఎన్నికల కమీషన్ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అమల్లో వున్న ఎన్నికల కోడ్ ను తొలగించింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఈ చర్యలకు ఈసీ పూననుకుంది.

రాష్ట్రంలో ఫణి తుపాను ప్రభావంతో అతలాకుతలమైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎన్నికల కోడ్ నియమావళిని కేంద్రం ఎన్నికల సంఘం తొలగించిందని రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఫణి పెనుతుపాను భీకర రూపం దాల్చి తీర్పరాంత్రాల్లో తీరం దాటేందుకు వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఎన్నికల కోడ్ తొలగించాలని రాష్ట్ర అపధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఎన్నికల కమీషన్ కోడ్ ను తొలగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఫణి తుపాను తీరం దాటే సమయంలో 150 నుంచి 200 మేర వేగంతో వీచిన గాలులు పెను బీభత్సం సృష్టించడంతో ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు.. అనేక చెట్లు.. పూరిళ్లు, విద్యుత్ స్థంబాలు, పలు చోట్ల టవర్లు కూడా నెలకూలాయి. ఎడతెరపిలేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షంతో వరదలు కూడా సంభవించే అవకాశాలు వున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో పునరుద్దరణ చర్యలతో పాటు సహాయ చర్యలను కూడా అందించేందుకు ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ను ఎత్తివేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles