hunger death in anantapuram of Ap ఏపీలో ఆకలి చావు.. అనంతలో మట్టి తిన్న బాలిక మృతి..

Hunger death in andhra pradesh two years old died of starvation

hunger death, ananthapuram, kadiri, kummaravandlapalle, two years old, gudibanda, mahesh, nelaveni, karnataka, andhra pradesh

The most horrible incident which came to light after two days, a two year old gril child die due to starvation. she ate sand to fullfill her hunger and fell ill and took a last breath on april 28th.

ఏపీలో ఆకలి చావు.. అనంతలో మట్టి తిన్న బాలిక మృతి..

Posted: 05/02/2019 08:12 PM IST
Hunger death in andhra pradesh two years old died of starvation

అన్నపూర్ణగా బాసిల్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండేళ్ల చిన్నారి ఆకలి చావుకు గురైంది. రాష్ట్రంలోని అనంతపురంలో జరిగిన ఈ హృదయవిదారక ఘటన అందరిని కంటతడి పెట్టించింది. కర్ణాటక నుంచి వలస వచ్చిన ఓ కుటుంబంలో చిన్నారి ఆకలికి తట్టుకోలేక మట్టిని తిని అనారోగ్యంపాలై కన్నుమూసింది. ఈ నెల 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంత జిల్లాలోని కదిరి మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం గుదిబండ గ్రామం నుంచి మహేష్, నీలవేణి దంపతులు పదేళ్ల క్రితం కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని హమాలీ క్వాటర్స్ కు వచ్చి స్థిరపడ్డారు.

కూలి చేసుకుంటూ మహేష్ కుంటుంబాన్ని తన భార్యతో పాటు ఐదుగురు సంతానాన్ని కూడా పోషించుకుంటున్నాడు. వీరితో పాటు తన భార్య (నీలవేణి) అక్క కూతుర్ని కూడా తమ వద్దే పెంచుకుంటున్నారు. ఓ చిన్న గుడారం వేసుకుని దాంట్లోనే జీవనం సాగిస్తున్నారు. మహేష్ ఒక్కడిపైనే కుటుంబ భారం పడటంతో అప్పుడప్పుడు వచ్చే కూలి డబ్బులు వారి కనీస అవసరాలను కూడా తీర్చడం లేదు. దీంతో మహేష్ తో పాటు నీలవేణి కూడా పనుల కోసం వెళ్లేది. అయితే పని లభిస్తేనే వీరు పిల్లలకు ఏమైన తీసుకువచ్చేవారు.. లేదంటే పస్తులుండాల్సిందే.

ఈ క్రమంలో ఇంటి వద్దనే వుండి పిల్లల అలనా పాలనా చూసుకునే నీలవేణి తల్లి మద్యానికి బానిసయ్యింది. దీంతో పిల్లల ఆలనా, పాలనా చూసేవాళ్లు లేక.. నీలవేణి అక్క కూతురైన రెండేళ్ల చిన్నారి మూడు రోజుల క్రితం ఆకలికి తట్టుకోలేక మట్టి తిని అనారోగ్యానికి గురై మృతి చెందింది. దీంతో చలించిపోయిన వారు.. చేసేదేమీ లేక.. తాము నివసించే గుడారం పక్కనే పాప మృత దేహాన్ని పూడ్చిపెట్టారు. ఏడాది కిందట కూడా వీరి పిల్లలో ఒక పాప ఇలానే అనారోగ్యంతో చనిపోయింది. ప్రభుత్వాలు మారుతున్నా, పేదలందరిన్నీ ధనవంతుల్ని చేస్తామన్న హామీలు మాత్రం ఇలాంటి ఘటనలతో వెక్కిరిస్తున్నాయి. ఆకలి చావులు లేకుండా ఆహారభద్రతా పథకం వచ్చినా.. ఇలాంటి చావులు జరగడం దయనీయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles