konda-vishweshwar-reddy-approches HC for anticipatory-bail కొండా విశ్వేశ్వర్ రెడ్డికి హైకోర్టులో ఊరట

Telangana highcourt grants anticipatory bail to konda vishweshwar reddy

Anticipatory bail granted to Konda vishweshwar reddy, highcourt grants bail to konda vishweshwar reddy, Konda Vishweshwar Reddy, Congress, High Court, Nampally Court, Bail granted, Anticipatory bail, Banjara Hills police station, Telangana, politics, crime

Telangana High court grants anticipatory bail to Congress leader Konda Vishweshwar Reddy, orders banjara hills police not to arrest him and suggests the congress leader to co_operate with police investigation.

కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డికి హైకోర్టులో ఊరట..

Posted: 04/29/2019 04:47 PM IST
Telangana highcourt grants anticipatory bail to konda vishweshwar reddy

కాంగ్రెస్ నేత, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. నాంపల్లి కోర్టులో ఎదురైన భంగపాటు నేపథ్యంలో ఆయన రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయన బెయిల్ పిటీషన్ ను స్వీకరించిన న్యాయస్థానం.. ఇవాళ విచారించి ఆయన షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం రూ.25,000 చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది.

పోలీసుల విచారణకు సహకరించాలని ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డికి కండీషన్ విధించింది. అలాగే ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయరాదని బంజారాహిల్స్ పోలీసులకు స్పష్టం చేసింది హైకోర్టు. జూబ్లీహిల్స్ కు చెందిన ఎస్ఐ, కానిస్టేబుల్ లను నిర్భంధించారన్న కేసులో ఆయనపై అభియోగాలు నమోదైన క్రమంలో.. ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో హైకోర్టు కొండా విశ్వేశ్ర్వర్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఊరట లభించింది.

అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన అంతకుముందు నాంపల్లి న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేయగా న్యాయస్థానం తిరస్కరించిన విషయం తెలిసిందే. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన ఆయన.. ఎన్నికలకు రెండ్రోజుల ముందు ఆయన బంధువు, అడ్వకేట్ సందీప్ రెడ్డి రూ.10లక్షలు కారులో తరలిస్తూ హైదరాబాద్ లో పోలీసులకు పట్టుబట్టారు. ఈ డబ్బు విశ్వేశ్వర్‌రెడ్డిదని, ఓటర్లకు పంపిణీ చేసేందుకు తరలిస్తున్నట్లు తేలడంతో పోలీసులకు ఆయనకు నోటీసులు జారీచేశారు. నేరుగా నోటీసులు అందించేందుకు గచ్చిబౌలి ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ ఆయన నివాసానికి వెళ్లగా వారిద్దరినీ కొండా అనుచరులు నిర్బంధించారని అభియోగాలు నమోదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles