sexual allegations on sutradhar acting institute నటన నేర్పమంటే బట్టలిప్పమంటారా.? సూత్రధార్ యాక్టింగ్ అకాడమిపై కేసు

Sexual harassment allegations on sutradhar acting institute director vinay varma

sexual harassment allegations on sutradhar acting institute, sexual allegations on vinay varma, sutradhar acting institute director vinay varma, Vinay Varma, sutradhar acting school, sutradhar acting institute, she teams, narayanguda police, hyderabad, crime

A young women complaints to narayanguda police on sexual harassment in sutradhar acting institute by director vinay varma, who had forced them to strip the clothes and stand nude after closing all the doors and windows of the institute.

నటన నేర్పమంటే బట్టలిప్పమంటారా.? సూత్రధార్ యాక్టింగ్ అకాడమిపై కేసు

Posted: 04/17/2019 09:25 PM IST
Sexual harassment allegations on sutradhar acting institute director vinay varma

సినీమా ఇండస్ట్రీతో పాటు పలు రంగాలలో ఎన్నాళ్లుగానో తిష్టవేసిన కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై ఇప్పుడిప్పుడే మహిళలు ధైర్యంగా బయటకు వచ్చి తాము ఎదుర్కోన్న ఘటనలను సమాజాం ముందుకు తీసుకువస్తూ.. ఎదుర్కోంటున్నారు. ఈ తరుణంలో ఓ సినీ ట్రైనింగ్ అకాడమిలో చోటుచేసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. నటన నేర్పించాలంటే నటనా విలువలు తెలిసుండాలని చెబుతారే తప్ప.. ఈ మాస్టారు మాత్రం వంటిపై వలువలు మాత్రం ఉండరాదంటూ.. అవి లేకపోతేనే నటన వస్తుందంటూ అసభ్యంగా ప్రవర్తించాడు.

ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు పిర్యాదు చేసింది. అయినా అక్కడ కూడా చాలా జాప్యం జరిగింది. హైదరాబాద్ హిమాయత్ నగర్‌లో జరిగిన ఈ ఘటన కలకలంరేపింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. నారాయణగూడలో వినయ్ వర్మ సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌‌ను నడుపుతున్నాడు. కొద్ది రోజుల క్రితమే బాధిత యువతితో పాటూ సహా మరో ఎనిమిదిమంది నటన నేర్చుకునేందుకు చేరారు. ప్రతి రోజు ఉదయం 6.30 నిమిషాల నుంచి 9.30 వరకు క్లాస్ జరుగుతోంది.

రెండు రోజుల క్రితం బాధిత యువతి క్లాస్‌కు వెళ్లింది. ఆమెతో పాటూ మిగిలిన ఎనిమిదిమంది రూమ్‌లోకి వెళ్లగానే వినయ్ వర్మ తలుపులు, కిటికీలు మూసేయమని చెప్పాడట. గదిలో ఉన్న అందర్ని బట్టలు విప్పమని వినయ్ వర్మ చెప్పాడు. అతడి మాటలతో షాక్ తిన్న కొందరు యువతులు అందుకు ఒప్పుకోలేదట. వెంటనే వినయ్ వర్మ యువతిని తిట్టి బయటకు పంపించాడట. వారిలో ఓ యువతి మాత్రం వర్మ చెప్పినట్లు బట్టలు తీసేసినట్లు బాధిత యువతి చెప్పుకొచ్చింది.

వెంటనే తాను ఈ వేధింపుల విషయాన్ని.. షీ టీమ్‌ దృష్టికి తీసుకెళ్లానని.. ఏసీపీ నర్మద సలహాతో నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చారు. తాను ఫిర్యాదు చేసినా పోలీసులు సరిగా స్పందించలేదని బాధితురాలు చెబుతోంది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు దాదాపు ఏడు గంటల సమయం వేచి ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే మీడియాను ఆశ్రయించాల్సి వచ్చిందని.. తన జీవితంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం ఇదే తొలిసారని వాపోయింది బాధితురాలు.

ఇదిలా ఉంటే.. యువతి వేధింపులపై యాక్టింగ్ స్కూల్ డైరెక్టర్ వినయ్ వర్మ స్పందించారు. యువతిని బట్టలు తీయమన్నది నిజమే కానీ.. పై దుస్తులు మాత్రమే తీయమన్నానన్నారు. ఆవిడకు డ్యాన్స్‌పై అంత ఇంట్రస్ట్ లేదని.. అందుకే తనపై ఆరోపణలు చేస్తోందన్నారు. 20 ఏళ్ల నుంచి ఎంతోమందిని హీరో, హీరోయిన్లు, నటులుగా తీర్చిదిద్దానన్నారు. తన శిష్యులు చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పుకొచ్చారు. నటనలో భాగంగా.. డ్రెస్ విషయంలో ఎవర్నీ ఒత్తిడి చేయలేదన్నారు. ఒకవేళ ఆమెకు నచ్చక పోతే వెళ్లొచ్చని చెప్పానన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles