36 Like Nirav Modi Have Fled Recently admits ED 36 మంది అర్థికనేరస్థులు దేశం నుంచి పారిపోయారు..

Not only mallya nirav 36 businessmen fled india in recent past ed tells court

businessmen fled india, indian businessman ditching banks, Enforcement Directorate, AgustaWestland, AgustaWestland case, Sushen Mohan Gupta, Rajiv Saxena, Rajat Gupta, Enforcement Directorate, businessman, ditching banks, vijay mallya, nirav modi, mukhul choksi, politics

The Enforcement Directorate told special judge Arvind Kumar that 36 businessmen, including Vijay Mallya and Nirav Modi, have fled from the country in the recent past.

36 మంది అర్థిక నేరస్థులు దేశం నుంచి పారిపోయారు..

Posted: 04/16/2019 04:04 PM IST
Not only mallya nirav 36 businessmen fled india in recent past ed tells court

బ్యాంకుల్లో సాదారణ ప్రజలు దాచుకున్న డబ్బును రుణాల రూపేణా వేల కోట్లను పోందిన పిమ్మట వారిని ఉద్దేశపూర్వకంగా ఎగొట్టి.. ఆర్థిక నేరాలకు పాల్పడి, దేశాన్ని విడిచి విదేశాలలో తలదాచుకుంటున్న వారి సంఖ్య ఒకటి రెండు నుంచి రెండెంకల స్థాయికి చేరిపోయింది. ఈ జాబితాలో వున్నవారు ఎవరంటే మనకు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలు మాత్రమే గుర్తుకొస్తారు. కానీ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వెల్లడించిన సంఖ్య తెలిస్తే షాక్ అవ్వకతప్పదు.

ఔనండీ దేశంలో అర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపిన అర్థిక ఉగ్రవాదులు దేశాన్ని విడచి విదేశాలలో తలదాచుకుంటున్న వారి సంఖ్య ఏకంగా 36. నమ్మశక్యంగా లేదా.? ఈ గణాంకాలు ప్రత్యేక న్యాయస్థానంలో జస్టిస్ అరవింద్ కుమార్ సమక్షంలో జరిగిన అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో మధ్యవర్తిగా అరోపణలు ఎదుర్కోంటూ అభియోగాలు నమోదైన సుషేన్ మోహన్ గుప్తా బెయిల్ పిటీషన్ విచారణ నేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ తెలిపిన వివరాలివి. పలు కుంభకోణాల్లో నిందితులుగా ఉన్న 36 మంది వ్యాపారవేత్తలు దేశాన్ని విడిచి వెళ్లిపోయారని ఈడీ సంచలన విషయాన్ని వెల్లడించింది.

దేశాన్ని కుదిపేస్తున్న అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ కుంభకోణం విచారణ సందర్భంగా... ఈ కేసులో అరెస్టైన సుషేన్ మోహన్ గుప్తా బెయిల్ పిటిషన్ పై ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ వాదనలను విన్నారు. ఈ సందర్భంగా సుషేన్ కు బెయిల్ ఇవ్వరాదని కోర్టును ఈడీ కోరింది. ఇతడిలా ఆర్థిక నేరాలకు పాల్పడిన 36 మంది ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయారని తెలిపింది. సమాజంలో తనకు మంచి పేరు ఉందంటూ సుషేన్ బెయిల్ కోరడాన్ని తప్పుబట్టింది. మాల్యా, నీరవ్ మోదీలకు కూడా సమాజంలో మంచి పలుకుబడి ఉందని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles