congress, NCP hits back at PM Modi విషం చిమ్ముతున్న ప్రధాని మోడీ.. ఎన్సీపీ ఘాటు విమర్శలు

Ncp hits back at pm modi says modi ji will have to give answers on the number of terrorist attacks in the country

NCP hit back at PM Modi, NCP national spokesperson, Nawab Malik, National congress party, Sharad pawar, BJP, Narendra Modi, jammu and kashmir, pakistan, kashmir seperatists, kashmir government, mahabooba mufti, constitution, Maharashtra, national politics

The NCP hit back at PM Modi, its national spokesperson Nawab Malik said National Conference has never talked about contesting polls with separatists and has fought elections as per the Constitution.

ప్రత్యేకవాదులతో కలసి మూడేళ్లు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిందెవరూ.?

Posted: 04/10/2019 03:45 PM IST
Ncp hits back at pm modi says modi ji will have to give answers on the number of terrorist attacks in the country

మహారాష్ట్రలోని లాతూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్రమోదీ ప్రజల మధ్య విద్వేషం రగిల్చే విధంగా, పార్టీలపై విషం చిమ్మేమాదిరిగా ప్రసంగాలు చేస్తున్నారని మహారాష్ట్ర నేషనల్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. దేశ విభజన జరిగింది కాంగ్రెస్‌తోనేనని.. పాకిస్థాన్‌ ఏర్పడిందే కాంగ్రెస్ వల్లే అన్న మోదీ.. ఆ పార్టీ మేనిఫెస్టో కూడా పాక్ భాషనే మాట్లాడుతుందని విరుచుకుపడ్డిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కూడా మోడీ సహా బీజేపికి కౌంటర్ ఇచ్చారు. దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చింది. దేశంలో సాంకేతిక విప్లవానికి కారణమైంది కూడా కాంగ్రెస్ పార్టీనే అని బదులిచ్చింది.

ఎన్నికల వేళ ప్రధాని మోడీ ఎప్పుడో జరిగిన దేశ విభజన గురించి మాట్లాడుతున్నారే తప్ప.. గత ఐదేళ్లకు ముందు ఆయన దేశ ప్రజలకు ఇచ్చిన హామీలన గురించి ఏమీ మాట్లాడలేకపోతున్నారని అన్నారు. దేశ ప్రజల అకౌంట్లలో 15 లక్షల రూపాయల డబ్బును వేస్తామన్న మోడీ.. అధికారంలోకి రాగానే వారిచేత అకౌంట్లు తెరిపించి.. అశలు రేకేత్తించారే తప్ప.. ఇప్పటి వరకు కనీసం ఒక్క పైసా వారి ఖాతాల్లో జమకాలేదని మహారాష్ట్ర కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించారు.

స్వాతంత్ర్యానికి ముందు కాంగ్రెస్ నేతలు తెలివిగా అలోచించారని అంటున్న ప్రధాని.. అదే తెలివితో తన ఐదేళ్ల పాలనలో ఏమీ చేయలేదని చెప్పలేక.. తరాలకు ముందు జరిగిన విషయాలను ఇప్పుడు ప్రస్తావిస్తున్నారని విమర్శించారు. గుజారత్ మోడల్ అభివృద్దిని చూసి అవకాశాన్ని ఇవ్వండీ అని చెప్పిన మోడీకి.. ఓట్లు వేసిన గెలిపిస్తే.. అదే ఓటర్లను నడిబజారులో బ్యాంకుల వద్ద, ఏటీయంల వద్ద నెలల పాటు నిలబెట్టారని.. ఆ ఆవేదనను ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని కాంగ్రెస్ దుయ్యబట్టింది.

అవినీతి రహిత భారత దేశం అంటూ నినాదాన్ని అన్నాహాజరే నుంచి హైజాక్ చేసిన ప్రధాని మోడీ.. దేశంలో మరీ ముఖ్యంగా బీజేపి నేతలు చేసిన అవినీతిపై విచారణకు ఎందుకు విచారణను అదేశించలేదని ప్రశ్నించారు. రాపెల్ డీల్ లో జరిగిన అవినీతి ఎంత అన్నది ప్రధాని.. దేశ ప్రజలకు చెప్పాలని నిలదీసారు. అమిత్ షా కొడుకు జైషా కంపెనీలోకి అక్రమంగా నిధులు ఎలా వచ్చాయన్న విషయం మోడీ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఇక మోడీ అధికారంలోకి రాగానే వెలుగులోకి వచ్చిన పనామా పేపర్లులో పేర్లున్న పెద్దలపై ప్రధాని.. ఐదేళ్లలో ఏమి చర్యలు తీసుకున్నారో ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రధానికి ఘాటు కౌంటర్ ఇచ్చిన ఎన్సీపీ..

భారత గడ్డపై ఉగ్రవాదులకు చోటులేదని, వారిని ఏరిపారేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ కేవలం ఎన్నికలకు ముందు మాత్రమే ప్రగల్భాలు పలుకుతారని నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ఎద్దేవా చేశారు. జమ్మూకాశ్మీర్ లో ప్రత్యేక ప్రధాని కావాలని తమ అధినేత శరద్ పవార్ అన్నార్న ప్రధాని అరోపణలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జమ్మూకాశ్మీర్ లో వేర్పాటు వాదులతో జతకట్టి మూడేళ్ల పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు.

తమ అధినేత శరద్ పవార్ భారత రాజ్యాంగానికి లోబడే నిర్ణయాలు తీసుకుంటారని, దానిని దాటి ఒక్క అంగుళం కూడా ముందుకు జరగరని ఆయన చెప్పారు. వేర్పాటు వాదుల వల్లే తాము అధికారంలోకి వచ్చామన్న పీడిపీ పార్టీ నేతలతో కలపి సువర్ణాధ్యాయం రచిస్తామన్న ప్రధని.. అర్థాంతరంగా వారిని వదిలేసి.. లోక్ సభ ఎన్నికల ముందు వేర్పాటు వాదం.. పాకిస్థాన్ అంటూ ప్రసంగాలు చేయడం.. దొంగే దొంగ దోంగా అని అరచినట్టు.. దయ్యాలు వేదాలు వల్లించినట్లు వుందని దుయ్యబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles