MLA Bhima Mandavi killed in maosist attack మావోల ఘాతుకం.. బీజేపి ఎమ్మెల్యే సహా ఆరుగురు మృతి

Maoists attack bjp convoy in dantewada mla bhima mandavi among 6 killed

BJP MLA killed in Maoist attack, BJP MLA convoy attacked in chhattisgarh, IED blast, Dantewada maoists attack, Dantewada attack, Naxal attack, Chhattisgarh, BJP MLA dead, Bhima Mandavi, five dead in naxal attack, BJP MLA dies in Naxal attack, Chhattisgarh, politics

BJP MLA Bhima Mandavi was killed as his convoy was attacked with an IED bomb by Maoists in Dantewada, Chhattisgarh. Five state police officers have also been killed in the attack.

మావోల ఘాతుకం.. బీజేపి ఎమ్మెల్యే సహా ఆరుగురు మృతి

Posted: 04/09/2019 06:08 PM IST
Maoists attack bjp convoy in dantewada mla bhima mandavi among 6 killed

లోక్ సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని మావోయిస్టు ఘాతుకానికి పాల్పడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారకార్యక్రమాలు నిర్వహిస్తున్న బీజేపి ఎమ్మెల్యే కాన్వయ్ ను లక్ష్యంగా చేసుకుని దంతెవాడలో నక్సలైట్లు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో బీజేపీ ఎమ్మెల్యేతో పాటుగా ఐదుగురు భద్రతా సిబ్బంది కూడా మృత్యువాత పడ్డారు.

బీజేపి నేత భీమా మండవి తన కాన్వాయ్ తో పాటుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో దంతెవాడలోని అటవీ ప్రాంతంలో ఆయన కాన్వాయ్ లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఐఈడీ బాంబు పేల్చారు. కాన్వాయ్ లోని చివరి కారులో ఉన్న ఎమ్మెల్యే భీమా మండవితో పాటు ఐదుగురు జవాన్లు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు పేలుడు ధాటికి ముక్కలు ముక్కలైపోయింది. పేలుడు జరిగిన వెంటనే నక్సలైట్లు కాల్పులకు తెగబడ్డారు. స్పాట్ కు చేరుకున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది మావోల కాల్పులను తిప్పికొడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dantewada  Naxal attack  BJP MLA dead  Bhima Mandavi  Chhattisgarh  politics  

Other Articles

Today on Telugu Wishesh