Allu Arjun Participates In Janasena Meeting at Palakollu పాలకొల్లు జనసేన మీటింగ్ లో ప్రత్యేక అకర్షణగా అల్లుఅర్జున్..

Stylish star allu arjun participates in janasena meeting at palakollu

Allu Arjun, tollywood Stylish Star Allu Arjun, Janasena, Pawan Kalyan, Palakollu, Varun Tej, Nagababu, Andhra pradesh, Politics

The Mega family members have come out to participate in the election campaign for Jana Sena party led by Pawan Kalyan. Varun Tej has already started election campaign for the party. Stylish Star Allu Arjun has joined the election campaign for Party Chief Pawan Kalyan in Palakollu.

పాలకొల్లు జనసేన మీటింగ్ లో ప్రత్యేక అకర్షణగా అల్లుఅర్జున్..

Posted: 04/09/2019 04:39 PM IST
Stylish star allu arjun participates in janasena meeting at palakollu

రాజకీయాల్లో మార్పు కోసం.. యువత పాతికేళ్ల బంగారు భవిష్యత్తు కోసం అనే నినాదంతో రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చి ఐదేళ్లు కావస్తున్నా.. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగుతున్న జనసేన పార్టీ గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రచారం చివరి రోజున పాలకొల్లులో జనసేన భారీ సభ నిర్వహించింది. ఈ జనసేన సభకు మరో అదనపు అకర్షణ వచ్చి చేరింది. హీరో.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు.

ఇప్పటికే తన తండ్రి నాగబాబు, చిన్నాన పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న భీమవరం అసెంబ్లీ సెగ్మంట్ల ప్రాంతంలో తన వంతుగా నటుడు మోగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పటికీ ప్రచారపర్వాన్ని మొదలుపెట్టాడు. జనసేన పార్టీకి తన వంతుగా ఆయన చేస్తున్న ప్రచారనేపథ్యంలో ఇవాళ తాజగా అల్లు అర్జున్ కూడా వచ్చి చేరడం అదనపు అకర్షణగా నిలిచింది. పాలకొల్లు ప్రచార సభకు వచ్చిన అల్లు అర్జున్ జనసేనాని పవన్ కరాచలనం చేసి.. ఆలింగనం చేసుకున్నారు. ఆ తరువాత సభ ముగిసే వరకు బన్ని సభావేదికపైనే వున్నారు. సింపుల్ డ్రెస్ లో వచ్చిన బన్నీ, పవన్ కల్యాణ్ కు సంఘీభావం ప్రకటించాడు.

బన్నీ రాకతో నరసాపురం నియోజకవర్గంలోని జనసైనికుల్లో ఉత్సాహం పెల్లుబికింది. ఎన్నికల ప్రచారం మొదట్లో మెగా కాంపౌండ్ హీరోలెవరూ జనసేన ప్రచారంలో పాల్గొనకపోయినా చివరి దశలో మాత్రం క్యూలు కట్టారు. వరుణ్ తేజ్ తన తండ్రి నాగబాబు, మరికొందరు జనసేన అభ్యర్థుల కోసం ప్రచారం చేయగా, పవన్ కు అస్వస్థత కలిగిందని తెలియగానే రామ్ చరణ్ హుటాహుటీన విజయవాడ చేరుకున్నాడు. ఇప్పుడు బన్నీ కూడా రావడంతో జనసేన వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Janasena  Pawan Kalyan  Palakollu  Varun Tej  Nagababu  Andhra pradesh  Politics  

Other Articles

Today on Telugu Wishesh