gauru charitha reddy says Jai Jagan in election campaign నోరు జారిన నవ్వులు పూయించిన గౌరు చరితారెడ్డి

Panyam tdp candidate gauru charitha reddy says jai jagan in campaign

gouru charitha reddy, kotla suryaprakash reddy, panyam, andhra pradesh Chandrababu, TDP president chandrababu, Chandrababu satire on YSRCP, Chandrababu sensational satire on YCP Fan, Chandrababu satire on YCP Fan, chandrababu, TDP, YS Jagan, YSRCP, sensational satire, andhra pradesh, politics

TDP Panyam mla contestanat Gouru charitha reddy who was in YSRCP party till a month back, has given up to that party and joined TDP made blunder in election campaing in her constituency. Instead of chandrababu she said Jai Jagan which created a funny scene.

ITEMVIDEOS: ఎన్నికల సిత్రం: నోరు జారిన నవ్వులు పూయించిన గౌరు చరితారెడ్డి

Posted: 04/09/2019 03:37 PM IST
Panyam tdp candidate gauru charitha reddy says jai jagan in campaign

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన కర్నూలు నేత గౌరు చరితా రెడ్డి ప్రచారం సందర్భంగా నోరు జారారు. పాణ్యంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎమ్మెల్యేగా తనను, లోక్ సభ సభ్యుడిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో టీడీపీకే ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు. చివరగా జై జగన్ అని గట్టిగా నినాదం ఇవ్వడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు షాక్ కు గురయ్యారు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తనకు ఇచ్చిన ఘనస్వాగతానికి చరితారెడ్డి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఒక్కసారిగా ‘జై జగన్’ అని అని నినాదం ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఈలలతో మార్మోగింది. వెంటనే తేరుకున్న చరితారెడ్డి నవ్వుతూ.. ‘జై చంద్రబాబు, జై తెలుగుదేశం’ అని నినాదాలు ఇచ్చి ముందుకు కదిలారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వైసీపీ శ్రేణులు

సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles