ys jagan sensational comments on forth comming government వైసీపీకి షాకిచ్చిన అమలాపురం ఎంపీ అభ్యర్థి

Shock to ysrcp amalapuram mp candidate chinta anuradha

YSRCP amalapuram MP candidate chinta anuradha, chinta anuradha YS Jagan, shock to YS Jagan, chinta anuradha sensational comments, chinta anuradha on MP Elections, YS Jagan, YSRCP, chinta Anuradha, Amalapuram, party fund, andhra pradesh, politics

Its a big shock to YSRCP president YS Jagan, Amalapuram MP candidate chinta Anuradha sensational comments doing rounds in social media against the party high command. Anuradha alleges party high command promised her to give party fund but disappointed.

ITEMVIDEOS: వైసీపీకి షాకిచ్చిన అమలాపురం ఎంపీ అభ్యర్థి చింతా అనురాధ

Posted: 04/08/2019 04:25 PM IST
Shock to ysrcp amalapuram mp candidate chinta anuradha

సార్వత్రిక ఎన్నికల తొలి విడత ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి రేపటితో ప్రచారపర్వం ముగియనున్న తరుణంలో.. మరో 72 గంటల్లో అభ్యర్థులు ప్రజాతీర్పుకు వెళ్లనున్న క్రమంలో వైసీపీ పార్టీకి తమ అభ్యర్థుల నుంచి షాక్ తగులుతుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో తమ అభ్యర్థులు వెనుకబడ్డారన్న సమాచారంతో వైసీపీ అధినేత జగన్ వారిని వారిస్తున్న క్రమంలో తమ చేతుల్లో నిధులు లేవని, పార్టీ నుంచి కూడా ఎలాంటి మద్దతు లభించడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అ క్రమంలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి చింతా అనురాధ కూడా పార్టీకి తేరుకోలేని షాక్ ఇచ్చారు. తాను ఎన్నికల బరిలో నిలిచేది లేదని అమె చెప్పారు. ఎన్నికల బరిలో తాను నిలబడలేనని అమె చేతులెత్తేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమె అమలాపురంలోని తన పార్టీ కార్యాలయానికి తాళాలు వేసి.. అక్కడి నుంచి ఫర్నీచర్ అంతా కూడా తన స్వగ్రామానికి తరలించారని సమాచారం.

అందుకు ముఖ్యకారణం కేవలం పార్టీ నుంచి అందాల్సిన ఫండ్ అందలేదనే అమె చెబుతున్నారు. అమలాపురం పార్లమెంటు నియోజవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మంట్ల అభ్యర్థుల నుంచి.. పార్టీ ద్వీతయ క్యాడర్ నుంచి అమె ఒత్తిళ్ల ఎదుర్కోంటున్నారని అమె సన్నిహితులు తెలిపారు. అమెకు టిక్కెట్ కేటాయించేందుకు ముందే అమె తన అర్థిక సామర్థతపై హైకమాండ్ కు అంతా వివరించారని, అయితే పార్టీ అండగా నిలిచి పార్టీ ఫండ్ ఇస్తామని చెప్పిందని, కానీ ఇప్పటి వరకు తనను పార్టీ అదుకోలేదని అమె సన్నిహితులు చెబుతున్నారు.

ఈ తరుణంలో కార్యకర్తలు కూడా డబ్బులివ్వనిదే ప్రచార పర్వం చేపట్టబోమని తెగేసి చెప్పడంతో.. అమె ఇంతలా డబ్బు ఖర్చవుతుంటే.. తాను మాత్రం ఎక్కడి నుంచి తీసుకువస్తానని ప్రశ్నించారని సమాచారం. వైసీపీ తొలి విడతలో ప్రకటించిన తొమ్మిది మంది ఎంపీ అభ్యర్థుల జాబితాలో పేరు దక్కించుకున్నా.. తనకు ఇస్తామన్న ఫండ్ ఇప్పటికీ అందించకపోవడంతో.. అమె పార్టీ కార్యాలయాన్ని అమలాపురం నుంచి స్వగ్రామానికి తరలించారు.

ఛస్..! అంతా ఉత్తదే: చింతా అనురాధ

కాగా, తనపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని చింతా అనురాధ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల పోటీ నుంచి తాను తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్న నేపథ్యంలో అమె దీనిపై స్పందించారు. తాను పోటీ నుంచి తప్పుకోలేదని, ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకే కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలను అవాస్తవాలను ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.

మహిళలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం ఇచ్చారని, దీన్ని కూడా సోషల్ మీడియా సహించలేకపోతోందని ఆమె నిప్పులు చెరిగారు. తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నామని, దుష్ర్పచారాలను తాము పట్టించుకోమని చింతా అనురాధ తెలిపారు. ఎంపీ రవీంద్రబాబు మాట్లాడుతూ.. చింతా అనురాధ ఎన్నికల్లో గెలవబోతున్నారని టీడీపీ ఇలాంటి కుట్రలకు తెరలేపిందని మండిపడ్డారు. ప్రత్యర్థివర్గం ఎన్ని కుట్రలు చేసినా అనురాధ గెలుపును అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  YSRCP  chinta Anuradha  Amalapuram  party fund  andhra pradesh  politics  

Other Articles