komati reddy brothers lashout at CM KCR బెదిరించే రాజ్యపాలన వద్దు.. ప్రజాగోంతునై ఎదురిస్తా: కోమటిరెడ్డి

Komati reddy brothers lashout at cm kcr in cheryal road show

komati reddy fires on CM KCR, komati reddy slams CM KCR on Hindutva defination, komatireddy venkat reddy KCR, komatireddy brothers, komatireddy rajgopal reddy KCR, KCR, Telangana CM, komati reddy venkat reddy, komati reddy rajgopalreddy, mandava venkateshwara rao, kavitha, nizamabad, Telangana, politics

Bhongir Lok Sabha congress candidate komatireddy venkat reddy conducts road show at cheryal, he says that TRS government is behaving just like dictatorship.. if this continues there will be no peoples voice.

బెదిరించే రాజ్యపాలన వద్దు.. ప్రజాగోంతునై ఎదురిస్తా: కోమటిరెడ్డి

Posted: 04/08/2019 02:41 PM IST
Komati reddy brothers lashout at cm kcr in cheryal road show

తెలంగాణలో ప్రస్తుతం నియంత పాలన సాగుతోందని కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో తనకు ఎదురులేకుండా వుండేందుకు ప్రత్యర్థి పార్టీల నేతలను తన పార్టీలోకి చేర్చకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎదరించేవాడు లేకుంటే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుందని హెచ్చరించారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 సీట్లనూ కోల్పోవడంతో కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయిందని దుయ్యబట్టారు.

నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి కవిత ఓడిపోతుందని కేసీఆర్ కు భయం పట్టుకుందని కోమటిరెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో వుండగా మీ కాళ్లలో ముళ్లు దిగితే తన పండితో తీస్తానన్న కేసీఆర్.. తన కూతురి కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అందులోనూ నిజమాబాద్ జిల్లాలో ఏకంగా 182 మంది రైతుబిడ్డలు తమ అపరిష్కృత సమస్యలపై రాజ్యాంగపద్దతిలో తేల్చుకునేందుకు కవితపై పోటీ చేస్తే.. కేసీఆర్ సమస్యలను పరిష్కారించకుండా.. కేవలం తన కూతరి గెలుపు కోసం మండవ వెంకటేశ్వరరావు ఇంటి మెట్టు ఎక్కారని విమర్శించారు.

గతంతో ఇదే టీడీపీ నేత మండవ వెంకటేశ్వరరావు టీడీపీ నుంచి పోటీ చేసిన క్రమంలో కేసీఆర్ అక్కడి సభల్లో సమావేశాల్లో తెలంగాణ మీద అంధ్రోళ్ల పెత్తనం ఎందని ప్రశ్నించలేదా.? ఇప్పుడు ఆయన కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాన రైతులు కాళ్లకు ముళ్లు కుచ్చుకున్నా.. పట్టించుకోకుండా మండవ ఇంటికి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని చేర్యాలలో రోడ్ షో నిర్వహించిన కోమటిరెడ్డి సోదరులు.. పిలుపునిచ్చారు. భువనగిరి అభ్యర్థిగా తనను గెలిపిస్తే ప్రజా గొంతుకగా పోరాడుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles