Middle class won't be burdened to fund Nyay: Rahul Gandhi ఐ లవ్ నరేంద్రమోడీ అన్న రాహుల్ గాంధీ

Rahul gandhi says i love narendra modi during interaction with students

rahul gandhi, rahul in pune, rahul gandhi i love modi, narendra modi, 2019 lok sabha elections, I love you modi, students, middle class, poverty MIP, congress, BJP, National politics

In an unscripted message to Prime Minister Narendra Modi, Congress president Rahul Gandhi said: “I love Mr Narendra Modi. I genuinely have no hatred towards the man at all.” His remarks were made during an interaction with students in Pune.

కనీస అదాయ పథకం మధ్యతరగతిపై భారం కాదు: రాహుల్

Posted: 04/05/2019 04:01 PM IST
Rahul gandhi says i love narendra modi during interaction with students

ప్రధాని మోదీపై తనకు ఎలాంటి ద్వేషం, ఆగ్రహం లేవని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. 'ఐ లవ్ నరేంద్ర మోదీ' అంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. పూణెలో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ దాడుల గొప్పదనం మన వైమానిక దళానిదని... ఆ దాడులకు రాజకీయం చేయరాదని అన్నారు. నాయకులకు జవాబుదారీతనం ఉండాలని చెప్పారు.

ప్రజలు అడిగే ప్రశ్నలకు తాను ధైర్యంగా సమాధానాలు చెబుతున్నానని... తనలా మోదీ ఎందుకు సమాధానాలు చెప్పలేకపోతున్నారని అన్నారు. మోదీపై తనకు ప్రేమ ఉందని, ద్వేషం ఏమాత్రం లేదని చెప్పారు. కనీస ఆదాయ భరోసా పథకం ద్వారా పేదలకు ఏడాదికి రూ. 72,000 వేస్తామంటూ తాము ఇచ్చిన హామీని నెరవేర్చుతామని రాహుల్ అన్నారు. దేశంలోని రూ.20 కోట్ల పేద కుటుంబాలకు ఏటా రూ.72,000 అందేలా చూడటం, వారిని ఆదుకోవడం తన డ్రీమ్ ఐడియా అని రాహుల్ చెప్పారు.

'మహాభారతంలో అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించడంపైనే దృష్టిపెట్టాడు. మీ అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తాననే అబద్ధాలు నేను చెప్పను. ఎందుకంటే అబద్ధాలు 2-3 నెలల కంటే ఎక్కువ చెల్లుబాటు కావు. నేను మీతో 15-20 ఏళ్లు కలిసి పనిచేయాలనుకుంటున్నాను' అని రాహుల్ చెప్పారు.భారత్ ప్రతి రోజు 27వేల ఉద్యోగాలను కోల్పోతోందని చెప్పారు. అనిల్ అంబానీ, మెహుల్ చోక్సీలాంటి వ్యక్తుల ప్రయోజనాల కోసమే ఎన్డీయే ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు తాము కృషి చేస్తామని రాహుల్ చెప్పారు. ఉద్యోగాల్లో సైతం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థపై ఎంతో ప్రతికూల ప్రభావాన్ని చూపిందని అన్నారు. దీని వల్ల కోట్లాది ఉద్యోగాలు పోయాయని విమర్శించారు. నాగపూర్‌లో పతంజలికి భూమి కేటాయించినప్పుడు కానీ, ప్రాజెక్టును హ్యాండిల్ చేసే డబ్బులు, ప్రాజెక్టు నిర్వహణా సామర్థ్యం లేనప్పటికీ రాఫెల్ ఆఫ్ సెట్ కాంట్రాక్ట్‌ను అనిల్ అంబానీకి కేటాయించినప్పుడు ఈ ప్రశ్నలు ఎందుకు వేయలేదని రాహుల్ నిలదీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles