IT Raids at TTD Chairman's Residence మైదుకూరు టీడీపీ అభ్యర్థి ఇంటిపై ఐటీ అధికారుల స్ట్రైక్..

It raids at mydukur tdp candidate putta sudhakar yadav s residence

IT strikes on putta sudhakar yadav, it raids on putta sudhakar yadav, it raids on TTD chairman's Residence, it raids on mydukur TDP candidate, TTD Chairman, Putta Sudhakar Yadav, IT Raids On TDP Leaders, Mydukur, Andhra Pradesh, politics

The income tax department officials are holding raids at TTD chairman Putta Sudhakar Yadav's residence in Proddutur, AP. Sudhakar Yadav is Telugu Desam's MLA candidate from Maidakuru.

మైదుకూరు టీడీపీ అభ్యర్థి ఇంటిపై ఐటీ అధికారుల స్ట్రైక్..

Posted: 04/03/2019 07:14 PM IST
It raids at mydukur tdp candidate putta sudhakar yadav s residence

కడప జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఐటీ అధికారులు దాడులు చేసిన సమయంలో పుట్టా సుధాకర్ యాదవ్ తన అసెంబ్లీ నియోజకవర్గమైన మైదుకూరులో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. పుట్టా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. వైఎంఆర్ కాలనీలోని ఆయన నివాసంపై కడప నుంచి వెళ్లిన ఐటీ అధికారి మహదేశ్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి.

ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపడుతున్నట్టు అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇలాంటి దాడులకు భయపడేది లేదని, టీడీపీ గెలుస్తుందనే భయంతోనే జగన్‌, మోదీ కలిసి ఇలాంటి దాడులు చేయిస్తున్నారని విషయంలో తెలిసిన మీడియా ప్రతినిధులు ప్రచారంలో వున్న పుట్టా సుధాకర్ యాదవ్ ను ఈ విషయంపై ప్రశ్నించగా ఆయన ఇలా స్పందించారు. ప్రధాని మోదీ కావాలనే టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.

కాగా, పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. ఈ సోదాల్లో ఎలాంటి పత్రాలు, నగదు లభ్యం కాలేదు. అయితే అధికారులు అక్కడి నుంచి వెళ్లబోయే సమయానికి పుట్టాతో పాటు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అక్కడికి చేరుకున్నారు. అధికారులు ఎవరి ప్రోత్భలంతో తనిఖీలు చేశారో తమకు తెలుసునని వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పుట్టా ప్రచారం చేసుకుంటున్న సమయంలో ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది?ఎవరు పంపించారు? అంతా వెదికారు కదా, ఏం దొరికిందో చెప్పండి?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అధికారులు మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TTD Chairman  Putta Sudhakar Yadav  IT Raids On TDP Leaders  Mydukur  Andhra Pradesh  politics  

Other Articles