YSRCP MLA Anil Kumar Yadav Controversial commnets అనీల్ కుమార్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు..

Ysrcp mla anil kumar yadav controversial comments

Anil kumar yadav is ready to kill or to be killed, Anil Kumar Yadav controversial comments, YSRCP MLA controversial comments, Nellore Urban Mla controversial comments, Ysrcp Candidate controversial comments, Anil Kumar Yadav, Nellore Urban Mla, Ysrcp Candidate, controversial comments,Andhra pradesh, politics

YSR Congress Party (YSRCP) nominee for the seat Dr Anil Kumar Yadav who is also the Nellore legislator, has made sensational comments that he is ready to kill or to be killed for YS Jagan.

ITEMVIDEOS: అనీల్ కుమార్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీకి పిర్యాదు

Posted: 04/02/2019 04:55 PM IST
Ysrcp mla anil kumar yadav controversial comments

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో నేపథ్యంలో నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా నెల్లూరు అర్బన్ అసెంబ్లీ సీటు బరిలో దిగిన అనీల్ కుమార్ యాదవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఆయన వ్యవహారతీరు ఎలాంటిదో మరోమారు స్పష్టమైందని నెల్లూరువాసులు భావిస్తున్నారు. ఎన్నికల వేళ తమ ప్రత్యర్థులు ఏలాంటి వ్యాఖ్యలు చేసినా.. తమ ప్రచారం తాము చేసుకుపోవాలే తప్ప.. అవేశకామేశాలకు లోనైతే.. ఏ క్షణంలోనైనా బలహీనపడితే.. వచ్చే మాటలు వివాదాస్పదం అవుతాయి.

ఇదే జరిగింది నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే విషయంలోనూ నిజమైంది. తాను పవన్ కల్యాణ్ అభిమానిగా చెప్పుకున్న అనీల్ కు స్వయంగా పవన్ కల్యాణే కౌంటర్ ఇవ్వడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బెట్టింగులు మానేసి తన అభిమానని చెప్పుకోమ్మని సూచించారు. తనను పవన్ కల్యాణ్ టార్గెట్ చేయడంతో.. ఇక డ్యామేజ్ అయిన తన ఇమేజ్ ను మళ్లీ పెంచుకునే పనిలో భాగంగా ఆనీల్ కుమార్ యాదవ్ ఏకంగా పార్టీ నేతల సమావేశంలో వీరావేశానికి లోనయ్యారు... అంతలోనే ఆయన నోరు జారారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

నెల్లూరు పట్టణ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయివుండి.. ప్రత్యర్థి పార్టీలను హెచ్చరికలు చేసే విధంగా.. వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల తర్వాత వైసీపీ జెండా ఎగరాల్సిందేనంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో చంపడమో... చావడో.. విజయమో.. వీరస్వర్గమో తేలిపోవాలన్నారు. జగన్ కనుసైగ చేస్తే నిమిషాల్లో అంతా కనుమరుగైపోతారని హెచ్చరించారు.

పార్టీ శ్రేణుల సమావేశంలో అనిల్ కుమార్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేయగా, అవి వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలను టీడీపీ నేతలు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు, నెల్లూరు సిటీ స్థానం టీడీపీ అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పి. నారాయణ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. దీంతో అనిల్ కుమార్ యాదవ్ గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగానే ఆయన నిగ్రహం కోల్పోయి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles