Congress fields Krishna Punia from Jaipur Rural క్రీడాశాఖ మంత్రికి కాంగ్రెస్ టఫ్ ఫైట్: బరిలో క్రీడాకారిణి

Congress fields krishna punia from jaipur rural lok sabha seat

Jaipur, loksabha elections, krishna punia, rajyavarthan rathore, BJP, Congress, central minister, National news, election updates, politics

Congress fielded Commonwealth Games gold medalist Krishna Punia against Union Minister and Olympian Rajyavardhan Singh Rathore from Jaipur Rural Lok Sabha seat.

క్రీడాశాఖ మంత్రికి కాంగ్రెస్ టఫ్ ఫైట్: బరిలో క్రీడాకారిణి

Posted: 04/02/2019 05:58 PM IST
Congress fields krishna punia from jaipur rural lok sabha seat

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారును గద్దె దింపడమే లక్ష్యంగా అడుగులేస్తున్న కాంగ్రెస్ ఎన్డీయే హయాం ప్రారంభంలో కాసింత చతికిలపడినా.. రాహుల్ విశ్రాంతి తీసుకుని తిరిగివచ్చిన తరువాత మాత్రం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇక ఆయన చేతికి ఏఐసిసి అధ్యక్ష పగ్గాలు అందిన తరువాత ఇక వెనక్కు తిరగకుండా ఓ వైపు ప్రజల్లోకి వెళ్తూనే మరోవైపు ఎన్డీయే హయంలోని కుంభకోణాలపై ఆయన నిలదీస్తున్నారు. ఇంకోవైపు ఏన్డీయేతర పక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగిస్తున్నారు.

ఇక ఈ నేపథ్యంలో అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడని కాంగ్రెస్.. ఇటీవలే తమ అధిపత్యం ప్రదర్శించిన రాజస్థాన్ రాష్ట్రంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి, బీజేపీ నేత రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ కు టఫ్ ఫైట్ ఇచ్చేందుకు బలమైన అభ్యర్థిని ఆయనకు పోటీగా దింపారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రికి పోటీగా ఒలింపిక్‌ క్రీడాకారిణిని కాంగ్రెస్ బరిలోకి దింపింది కాంగ్రెస్‌. క్రీడాకారుడిగా ఒలంపిక్ పతక విజేతగా గుర్తింపు సాధించిన రాజ్యవర్థన్ సింగ్ రాధోడ్ కు పోటీగా క్రీడాకారిణినే బరిలోకి దింపింది కాంగ్రెస్.

జైపూర్‌ రూరల్‌ లోక్‌సభ స్థానం నుంచి డిస్కస్‌ త్రోయర్‌ కృష్ణ పునియా పేరుని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి కేంద్రమంత్రి రాజ్యవర్ధన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ రాజ్యవర్ధన్‌ ఇదే స్థానం నుంచి బరిలోకి దిగుతుండగా.. ఆయనకు గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్‌ భావించింది. రాజ్యవర్దన్ ఒలింపిక్‌ పతక విజేత. దీంతో క్రీడారంగానికి చెందిన కృష్ణ పునియాకు ఆయనకు పోటీగా దింపింది కాంగ్రెస్‌.

 పద్మశ్రీ అవార్డు గ్రహీత కృష్ణ పునియా 2004, 2008, 2012లో జరిగిన ఒలింపిక్‌ పోటీల్లో పాల్గొన్నారు. 2010లో జరిగిన దిల్లీ కామన్వెల్త్‌ గేమ్స్‌ లో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. 2013లో కాంగ్రెస్‌ లో చేరిన పునియా.. ఆ ఏడాది జరిగిన రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సదుల్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jaipur  loksabha elections  krishna punia  rajyavarthan rathore  BJP  Congress  politics  

Other Articles