PSLV-C45 lifts off with EMISAT, 28 foreign satellites పీఎస్ఎల్వీ-సి45 ప్రయోగం విజయవంతం.. నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాలు

Isro s pslv c45 places emisat 28 foreign satellites in orbits

ISRO, isro live launch today, today isro news, isro satellite launch live, isro launchtoday, isro today, pslv c45, satellite EMISAT, 28 foreign satellites, ORBIT, pslv launch, pslv c45 launch, pslv full form, emisat, isro news

India’s latest observation satellite EMISAT took off smoothly on Monday morning with Isro placing payloads in three orbits and conducting space experiments for the first time.

పీఎస్ఎల్వీ-సి45 ప్రయోగం విజయవంతం.. నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాలు

Posted: 04/01/2019 11:34 AM IST
Isro s pslv c45 places emisat 28 foreign satellites in orbits

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో రాకెట్ ప్రయోగం చేపట్టింది. భారత రక్షణ రంగ అవసరాల కోసం రూపొందించిన ఎమిశాట్ ఉపగ్రహం సహా మరో 28 నానో ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు పీఎస్ఎల్వీ-సి45 రాకెట్ ను ఈరోజు ఉదయం 9.27 గంటలకు ప్రయోగించింది. ప్రాథమికంగా ప్రయోగం విజయవంతం అయినట్టు తెలుస్తున్నా, ఉపగ్రహాలన్నీ నిర్దేశిత కక్ష్యల్లోకి ప్రవేశించిన తర్వాతే ప్రయోగం పరిపూర్ణం అయినట్టు భావిస్తారు.

ప్రస్తుతం రాకెట్ ప్రయోగ అనంతర దశలు కొనసాగుతున్నాయి. కాగా, ఈసారి ప్రయోగంలో ప్రధానంగా ఎమిశాట్ ఉపగ్రహం గురించి చెప్పుకోవాలి. భారతదేశ రక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డీఆర్డీవో సంస్థ ఎమిశాట్ కు రూపకల్పన చేసింది. ఈ ప్రయోగంలో స్పెయిన్, స్విట్జర్లాండ్, అమెరికా, లిథువేనియా దేశాలకు చెందిన 28 నానో శాటిలైట్లను కూడా పీఎస్ఎల్వీ-సి45 రాకెట్ తనతో పాటు తీసుకెళ్లింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISRO  pslv c45  satellite EMISAT  28 foreign satellites  ORBIT  pslv c45 launch  isro news  

Other Articles