Karnataka CM stages protest in front of IT office ఐటీ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి ధర్నా..

Karnataka cm h d kumaraswamy stages protest in front of it office

karnataka CM protest in front of IT office, congress protest against IT raids, karnataka IT raids, kumarswamy, G. Parameshwara, Siddaramaiah, DK Shivakumar, it raid, Protest, karnataka, politics

Karnataka Chief Minister H.D. Kumaraswamy, Deputy Chief Minister from Congress G. Parameshwara, former Chief Minister Siddaramaiah and DK Shivakumar have staged a dharna in front of Income Tax Office,

ఆదాయ పన్ను శాఖ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి ధర్నా..

Posted: 03/28/2019 08:51 PM IST
Karnataka cm h d kumaraswamy stages protest in front of it office

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీలకు చెందిన నేతల ఇళ్లు, కార్యాలయాల్లోనే ఐటీ సోదాలు నిర్వహిస్తున్నందుకు నిరసనగా బెంగళూరులోని అదాయపన్ను శాఖ కార్యాలయం ఎదుట కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌.డీ.కుమారస్వామి ధర్నా నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల వేళ ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే పశ్చిమ బెంగాల్‌ చేసినట్లే తామూ ఆ సంస్థలకు రాష్ట్రంలో ఉన్న అధికారాలను కత్తిరిస్తామని కుమారస్వామి చెప్పిన 24 గంటల్లోనే ఈ సోదాలు ప్రారంభమయ్యాయి. దీనితో కుమారస్వామి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ అదాయశాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

దీంతో ప్రధాన మంత్రి దేశంలోని ప్రతిపక్షాలపై కూడా స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన సంస్థలతో సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారని అరోపించారు. ‘ప్రధాన మంత్రి చేయాలనుకున్న నిజమైన సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఇప్పుడు చేస్తున్నారు. ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీలకు చెందిన నాయకుల ఇళ్లపైనే ఐటీ సోదాలు చేస్తున్నారు. మోదీ ఆడుతున్న ఈ రాజకీయ చదరంగానికి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన ఐటీ అధికారి ఒకరు సహాయం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్ధులను భయభ్రాంతులకు గురిచేయడానికి ప్రభుత్వ సంస్థలను, అధికారులను వినియోగించుకోవడం బాధాకరం’ అని ట్విటర్‌ వేదికగా అన్నారు.

ఈరోజు కర్ణాటక చిన్న నీటి పారుదల శాఖ మంత్రి సీఎస్‌ పుత్తరాజు, ఆయన బంధువులకు చెందిన ఇళ్లలో ఐటీ దాడులు జరిగాయి. ఐటీ అధికారులు నేరుగా సీఆర్‌పీఎఫ్‌ బలగాలను వెంటతీసుకుని వచ్చి దాడులు చేశారు. ‘ఈ దాడుల వల్ల భయపడేది లేదు. ఎన్నికల సమయంలో కావాలనే ఈ దాడులు చేయిస్తున్నారు. భాజపాకు చెందిన నేతల ఇళ్లలో ఎక్కడైనా ఇటువంటి ఐటీ దాడులు జరిగాయా?’ అని మంత్రి పుత్తరాజు ప్రశ్నించారు.

మాజీ ప్రధాని హెచ్‌.డీ.దేవెగౌడ తనయుడు, ముఖ్యమంత్రి కుమారస్వామికి సోదరుడు, ప్రజా సంబంధాలు, అభివృద్ధి శాఖా మంత్రి హెచ్‌.డీ. రేవణ్ణకు చెందిన ఇళ్లల్లో కూడా ఐటీ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ దాడులపై కాంగ్రెస్‌ కూడా స్పందించింది. ‘స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఒక ప్రధానమంత్రి దుర్వినియోగం చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం’ అని ట్విటర్‌లో అరోపించారు. ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి దాడులు చేస్తున్న ప్రభుత్వం ఇదేనని చురకలంటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kumarswamy  G. Parameshwara  Siddaramaiah  DK Shivakumar  it raid  Protest  karnataka  politics  

Other Articles