Sitting MLA David Raju rejoins YSRCP వైసీపీలో చేరిన ఎర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యే

Shock to tdp yerragondapalem sitting mla david raju joins ycp

TDP sitting MLA David Raju joins YCP, MLA David Raju, Yerragondapalem Sitting MLA, David Raju joins YCP, MLA David Raju, TDP, YSRCP, Balineni Srinivas reddy, Erragondapalem, prakasham, Andhra Pradesh, Politics

Another blow to Ruling TDP party as the sitting MLA from Yerragondapalem of prakasham district, David Raju joins YCP party in the leadership of Balineni srinivas reddy, as he had been denied the sitting seat from TDP.

టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన ఎర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యే

Posted: 03/28/2019 11:45 AM IST
Shock to tdp yerragondapalem sitting mla david raju joins ycp

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, తొలి దశ సార్వత్రిక ఎన్నికలకు మరో పక్షం రోజుల వ్యవధి కూడా లేని తరుణంలో అధికార టీడీపీకి ఆ పార్టీకి చెందిన నేత మరో షాక్ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న తనను కాదని, మరోకరికి పార్టీ టికెట్ కేటాయించడంతో పార్టీపై అక్కస్సును ప్రదర్శించిన ఎమ్మెల్యే.. అధికార పార్టీపై ప్రతీకారం కోసం ఎదురుచూస్తూ.. సరిగ్గా ఎన్నికల సమయంలో షాకిచ్చారు. కీలక సమయంలో పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటూ ప్రత్యర్థి పార్టీలో జాయిన్ అయ్యారు.

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యే డేవిడ్ రాజు వైసీపీలో చేరారు. అయితే ఆయనకు రాజకీయ ప్రస్తానాన్ని కల్పించిన వైసీపీ పార్టీ నుంచి గెలిచిన తరువాత 2014లోనే ఆయన టీడీపీలో చేరారు. దీంతో ఆయన మరోమారు తన మాతృపార్టీలో చేరినట్లు అయ్యింది. తన కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎర్రగొండపాలెం టికెట్ ను తనకు కేటాయించకపోవడంతో మనస్తాపం చెందిన డేవిడ్ రాజు ఈరోజు వైసీపీలో చేరినట్లు సమాచారం.

ఎర్రగొండపాలెం టికెట్ ను రాజకీయ సమీకరణాల్లో భాగంగా చంద్రబాబు బుద్దల అజితారావుకు కేటాయించారు. దీంతో డేవిడ్ రాజుకు చుక్కెదురైంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున డేవిడ్ రాజు ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే ఆయన తన గెలుపోందిన పార్టీని ఫిరాయించి టీడీపీలో చేరారు. ఇప్పుడు టికెట్ దక్కకపోవడంతో తిరిగి సొంతగూటికే చేరుకున్నారు. అయితే ఈ ఫిరాయింపును పలువురు స్వాగతిస్తుండగా, పలువురు వైసీపీ నేతలు మాత్రం అవకాశవాదులతో జాగ్రత్తగా వుంటాలంటూ సూచనలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLA David Raju  TDP  YSRCP  Balineni Srinivas reddy  Yerragondapalem  prakasham  Andhra Pradesh  Politics  

Other Articles