TRS will never offer me to join the ruling party: jagga reddy నాకు సారు కారు పిలుపు రాదు: జగ్గారెడ్డి

Trs will never offer me to join the ruling party jagga reddy

Jaya Prakash Reddy, Jagga Reddy, Sangareddy MLA, KTR, KCR, BJP, Congress, Sangareddy MLA jagga reddy, Telangana CM, Congress, Telangana, politics

Congress Senior Leader and Sangareddy MLA Jaya Prakash Reddy alias Jagga Reddy said in chit chat with media in Gandhi Bhavan, that Ruling party TRS will never ask or dare him to join the party.

నాకు సారు ‘‘కారు’’ పిలుపు రాదు: జగ్గారెడ్డి

Posted: 03/21/2019 08:19 PM IST
Trs will never offer me to join the ruling party jagga reddy

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో ఎవరు ఉన్నా.. లేకపోయినా భవిష్యత్తు మాత్రం ఆ పార్టీదేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ప్రజలు కాంగ్రెస్‌ వైపే చూస్తారని అయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కలను సాకారం చేసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజానీకంలో మంచి పేరుందని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి యూపీఏ చైర్ పర్సెన్ సోనియాగాంధీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను తెలంగాణ ప్రజలు ఎవ్వరూ మర్చిపోరని అయన అన్నారు.

హైదరాబాదులో జగ్గారెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. ఎందరు అడ్డుకున్నా.. కుట్రలు చేసినా.. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నిర్వీర్యం అయిపోతుందని తెలిసినా.. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాకారం చేసింది సోనియా గాంధీయేనని ఆయన మరోమారు తెల్చిచెప్పారు. అయితే ఈ విషయం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కూడా స్పష్టంగా తెలుసునని అన్నారు.

కాగా, కొందరు నేతలు పార్టీని వీడేందుకు వారి బలహీనతలే కారణం తప్ప పార్టీ తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. ఉత్తమ్‌, రేవంత్‌రెడ్డి, విశ్వేశ్వర్‌ రెడ్డితో పాటు ఖమ్మం లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. మెదక్‌, సికింద్రాబాద్‌ సీట్లలో కూడా తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలు మెండుగా వున్నాయని చెప్పారు. టీఆర్ఎస్ తనను ఆ పార్టీలోకి ఆహ్వానించదని, ఇప్పటివరకు తనను పిలవలేదని చెప్పారు. సారు కారు పిలుపు తనకు రాదని చెప్పారు. వారు చెప్పిన మాట విననని.. అందుకే తానంటే టీఆర్ఎస్ కు ఇష్టం ఉండదని వ్యాఖ్యానించారు. పార్టీ మార్పుపై తన బిడ్డ నిర్ణయమే ఫైనల్‌ అని జగ్గారెడ్డి స్పష్టంచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jaya Prakash Reddy  Jagga Reddy  Sangareddy MLA  KTR  KCR  BJP  Congress  Telangana  politics  

Other Articles