Pawan kalyan, laxmi narayana file nomintions at GVMC నామినేషన్ దాఖలు చేసిన జనసేనాని పవన్. జేడీ లక్ష్మీనారాయణ

Janasena president pawan kalyan laxmi narayana file nomintions at gvmc

pawan kalyan, janasena, Pawan Kalyan SPY Reddy, Pawan Kalyan VV Laxmi Narayana, VV Laxmi Narayana JanaSena, VV Laxmi Narayana vishakapatnam Lok Sabha, Pawan Kalyan Gajuwaka, andhra pradesh, politics

Janasena President Pawan kalyan, cbi former JD VV Laxmi Narayana filed nomintions at GVMC office for gajuwaka assembly and vishakapatnam Lok Sabha seat.

నామినేషన్ దాఖలు చేసిన జనసేనాని పవన్. జేడీ లక్ష్మీనారాయణ

Posted: 03/21/2019 01:18 PM IST
Janasena president pawan kalyan laxmi narayana file nomintions at gvmc

గాజువాక నియోజకవర్గం ఒక మిని ఆంధ్రప్రదేశ్ కాదు.. ఒక మిని భారత దేశమని పవన్ కల్యాణ్ అన్నారు. ఇలాంటి నియోజకవర్గానికి తాను ప్రాతినిధ్యం వహించడం తనకు నిజంగా గర్వకారణంగా వుందని చెప్పారు పవన్ కల్యాణ్. గతంలో ఎవ్వరూ చేయనంత అభివృద్ది ఈ నియోజకవర్గానికి తాను చేస్తానని అక్కడి ప్రజలకు హామి ఇచ్చారు. తమ పార్టీ తరపున ఈ నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థిగా సీబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణను బరిలోకి దింపుతున్నామని పవన్ చెప్పారు.

లాండ్ మాఫియా, భూకబ్జాలకు, ఇసుక మాఫియా, క్రిమినల్ యాక్టివిటీస్, ఫాక్షన్ రాజకీయాలకు, క్రిమినల్ రాజకీయాలకు, సంఘవిద్రోహశక్తులు ఎవరూ ఇక్కడకు వచ్చి ప్రజల శాంతి, సామరస్యాలను విచ్చిన్నం చేయుకుండా చూసుకునేందుకు ఆయన ప్రాతినిధ్యం చాలా దోహదపడుతుందని పవన్ అన్నారు. విశాఖ ప్రజలకు నిత్యం అండగా వుండేలా.. అన్ని అంశాలను పరిశీలించిన తరువాత తమ పార్టీ తరపున జేడీ లక్షీనారాయణకు పార్లమెంటు బరిలోకి దింపామని పవన్ కల్యాణ్ చెప్పారు.

తన నటనా జీవితం వైజాగ్ నుంచే ప్రారంభమైందని, ఇక తన రాజకీయ జీవితం కూడా వైజాగ్ నుంచే ప్రారంభం కావాల్సి వుందని పవన్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తాను గాజువాక ప్రజల కోసమే వచ్చానని, వారి కష్టాలను తీర్చడానికే వచ్చానని జనసైనికుల మధ్య జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇంతటి అపూర్వ అవకాశాన్ని ఇచ్చిన అన్నదమ్ములకు, అక్కా చెల్లళ్లకు, ధన్యవాదాలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles