One seat, three phases ఈ లోక్ సభ స్థానం ప్రత్యేకం.. మూడు దశల్లో పోలింగ్

Lok sabha elections anantnag constituency to vote in three phases

Kashmir poll dates, Kashmir elections, Anantnag polling, three phases, Lok Sabha Elections, Election Commission, Sunil Arora, Kashmir state elections, Omar Abdullah, Mehbooba Mufti, Kulgam, Anantnag, Pakistan, BJP, Shopian, Pulwama, People’s Democratic Party National Conference, politics

Polling in the Anantnag Lok Sabha seat of Jammu and Kashmir will take place in three phases – the first time that polling for a single seat will be held in multiple phases

ఈ లోక్ సభ స్థానం ప్రత్యేకం.. మూడు దశల్లో పోలింగ్

Posted: 03/11/2019 07:16 PM IST
Lok sabha elections anantnag constituency to vote in three phases

దేశ వ్యాప్తంగా లోక్ సభ స్థానాలకు ఎన్నికల నగారా మ్రోగిన నేపథ్యంలో దేశంలో మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా విడతల వారీగా ఎన్నికలు జరుగునున్నాయి. లోక్ సభ ఎన్నికలు విడతల వారీగా జరగడం సర్వసాధరణమే కదా.. అంటే.. కేవలం లోక్ సభ ఎన్నికలకు మాత్రమే వెళ్తున్న పశ్చిమ బెంగాల్ లో పలు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. గతంలో లేని విధంగా ఏకంగా ఐదు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇక దీనికి తోడు మునుపెన్నడూ లేని విధంగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని అనంత్‌నాగ్‌ లోక్ సభ స్థానానికి మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.   ఈ రాష్ట్రంలో ఉగ్రవాదుల కదలికలు ఎక్కువగా ఉండడంతో భద్రతా సిబ్బందికి పొంచివున్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈసీ సునీల్‌ అరోరా ప్రకటించారు. రాష్ట్రంలో ఆరు లోక్‌సభ స్థానాలు ఉండగా వీటికి ఐదు విడతల్లో పోలింగ్‌ జరుగుతుండడం మరో విశేషం.

గతంలో రెండు దశల్లో ఎన్నికలు పూర్తిచేసిన జార్ఖండ్‌, ఒడిశాల్లో కూడా నాలుగు విడతల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. జార్ఖండ్ లోని 14 స్థానాలు, ఒడిశాలో 21 స్థానాలు ఉండగా వాటికి నాలుగు విడతలుగా పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రభావం అధికంగా వున్నందున శాంతిభద్రతల మధ్య ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు, ఎటువంటి  సమస్యలు తలెత్తకుండా కొనసాగేందుకు ఎన్నికల కమిషన్‌ విడతల వారీగా పోలింగ్‌ నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anantnag polling  Lok Sabha Election  three phases  Election Commission  Sunil Arora  politics  

Other Articles