Court recalls arrest directive, orders planting of saplings మొక్కలు నాటితే అరెస్టు వారెంటు రద్దు: కోర్టు

Plant 5 saplings will cancel arrest order court tells rape accused

Ghaziabad fast track court, rape accused, five saplings, court affidavit, non bailable warrant, toddler rape accused, rape and murder, Delhi crime, unique verdict

In a first-of-its-kind order, a court here recalled its arrest warrant on condition that the accused will plant five saplings, an official said on Saturday.

ఐదు మొక్కలు నాటితే అరెస్టు వారెంటు రద్దు చేస్తామన్న కోర్టు

Posted: 03/09/2019 06:52 PM IST
Plant 5 saplings will cancel arrest order court tells rape accused

నాలుగేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన నిందితుడిని ఓ కోర్టు వినూత్న రీతిలో ఆదేశించింది. ఐదు మొక్కలు నాటితే.. అరెస్ట్ వారెంట్ రద్దును చేస్తామని ఘాజియాబాద్ కోర్టు పేర్కొంది. ఇందుకు సమ్మతిగా కోర్టులో అఫడవిట్ ను దాఖలు చేయాల్సిందిగా సదరు నిందితుడికి సూచించినట్టు ఘాజియాబాద్ జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ గవర్నరమెంట్ కౌన్సిలర్ (ఏడీజీసీ) రాజీవ్ కుమార్ చెప్పారు. దేశంలో ఈ తరహాలో కోర్టు ఆదేశించడం ఇదే తొలిసారి.  

బాలికపై కిడ్నాప్, అత్యాచారానికి పాల్పడిన అభియోగాలపై న్యాయస్థానంలో విచారణను ఎదుర్కోంటున్న నిందితుడు.. ఘజియాబాద్ లోనీ ప్రాంతానికి చెందిన రాజు అలియాస్ కల్లూ అనే వ్యక్తికి గత ఆరుమాసాలుగా న్యాయస్థానానికి హాజరుకావడం లేదు. అయితే అతనిపై న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు స్పెషల్ జడ్జీ రాకేశ్ వశిష్ఠ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు అతన్ని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు.

నాన్ బెయిలబుల్ వారెంట్ ఆదేశాలపై నిందితుడు రాజు.. వారెంట్ ను రీకాల్ కోరుతూ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారించిన కోర్టు.. అత్యాచార నిందితుడిని ఐదు మొక్కలు నాటి.. కోర్టులో అఫడవిట్ దాఖలు చేయాలని సూచించింది. అందుకు సమ్మతి ఇస్తే.. నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేస్తామని కోర్టు కండీషన్ పెట్టింది. దీంతో తనపై వచ్చిన నాన్ బెయిలెబుల్ వారెంట్ ను తొలగించుకునేందుకు అందుకు సమ్మతించాడు నిందితుడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape accused  rape  plant five saplings  ghaziabad  ghaziabad court  unique verdict  

Other Articles