At over 100, woman comes out alive from surgery శతాధిక వృద్దురాలికి హృద్రోగ సర్జరీ సక్సెస్..

118 year old becomes oldest woman to be operated upon enters guinness record

Kartar Kaur Sangha, oldest woman, Guinness World Record, oldest woman alive, oldest woman age, oldest woman in India, Punjab, Ludhiana latest news, Ludhiana news live, Ludhiana news today, Today news Ludhiana, Centenarian surgery, Ravninder Singh Kuka (cardiologist), Ferozepur district, Punjab

Kartar Kaur Sangha, 118-year-old, has registered her name in the Guinness World Record to become the oldest person to be operated upon, doctors at Satguru Partap Singh Apollo Hospital here confirmed.

అద్భుతం: శతాధిక వృద్దురాలికి హృద్రోగ సర్జరీ సక్సెస్..

Posted: 03/08/2019 12:38 PM IST
118 year old becomes oldest woman to be operated upon enters guinness record

వైద్యచరిత్రలో ఇదో అద్భుత పరిణామం. శతాధిక వృద్దురాలు ఏకంగా గెన్నిస్ ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కింది. అందుకు దోహదపడింది మాత్రం వైద్యనిపుణులే. అసలేం జరిగిందంటే.. పంజాబ్ లోని లుధియానా పట్టణానికి చెందిన ఓ 118 ఏళ్ల బామ్మ హృద్రోగ సమస్యలతో బాధపడుతూ అసుపత్రికి చేరుకుంది. దీంతో అమెకు వైద్యులు గుండె ఆపరేషన్ నిర్వహించారు. శస్త్రచికిత్స విజయవంతం కావడం.. ఆ తరువాత అమె నవ్వుతూ బయటకు రావడం.. తనకు సర్జరీ నిర్వహించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

దీంతో శతాధిక వృద్దురాలికి హృద్రోగానికి సంబంధించి ఆపరేషన్ చేయడం, అది పూర్తిగా విజయవంతం కావడం గొప్ప విషయమని భావించిన వైద్యులు.. గిన్నీస్ బుక్ రికార్డ్స్‌కి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ వారికి రిఫర్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. చికిత్స సక్సెస్ అయ్యిందని.. ప్రస్తుతం బామ్మ బాగానే మాట్లాడుతోందని వైద్యులు వెల్లడిస్తున్నారు. కర్టార్ కౌర్ సంఘా అనే ఈ శతాధిక వృద్దురాలు లుథియానాలో ఉంటున్న కర్తార్ కౌర్ 1901లో జన్మించారు. ప్రస్తుతం ఈమెకు 118 సంవత్సరాలు.

ఆమె తన వంశంలోని ఐదు తరాలను చూసింది. ఈమెకు 90 ఏళ్ల కూతురు కూడా ఉంది. అయితే గుండెకు సంబంధించిన వ్యాధితో ఈమె లుథియానాలోని అపోలో హాస్పిటల్ లో ఫిబ్రవరి 24వ తేదీన అడ్మిట్ అయ్యింది. పేస్ మేకర్‌ అమర్చాల్సి ఉంటుందని వైద్యులు నిర్దారించారు. అయితే ఈమె వయస్సు అడ్డంకిగా ఉంటుందని డాక్టర్స్ ఆలోచించారు. చివరకు పేస్ మేకర్ ని విజయవంతంగా అమర్చారు. ఈ వయస్సులో ఆపరేషన్ చేయడం పెద్ద ఛాలెంజ్ అని వైద్యులు వెల్లడించారు. అయినా కార్డియాలజిస్ట్ రవిందర్ సింగ్ కుకా ధైర్యం చేసి అమెకు ఫేస్ మేకర్ ను అమర్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kartar Kaur Sangha  oldest woman  Guinness World Record  Ludhiana  Punjab  

Other Articles