Janasena clarifies on Pawan Kalyan war comments పవన్ కల్యాణ్ యుద్దం వ్యాఖ్యలపై జనసేన పార్టీ క్లారిటీ..!

Janasena asks national media to stop misinterpreting pawan kalyan comments

Pawan Kalyan, national media, pakistan media, Narendra Modi, Congress leader, Jana Sena, JanaSena, Janasena, Twitter, Wing commander (rank), Randeep Surjewala, Indian Armed Forces, Indian Armed Forces, Prime Minister of India, Abhinandan Varthaman, Social media, Politics

JanaSena Party chief Pawan Kalyan in a video released by party asks national media to stop misinterpreting Janasena on saying political observers prediction.

పవన్ కల్యాణ్ యుద్దం వ్యాఖ్యలపై జనసేన పార్టీ క్లారిటీ..!

Posted: 03/02/2019 11:38 AM IST
Janasena asks national media to stop misinterpreting pawan kalyan comments

సార్వత్రిక ఎన్నికలకు ముందు దాయాధి దేశాలైన భారత్ - పాకిస్థాన్ ల మధ్య యుద్ధం రాబోతోందంటూ రెండేళ్ల క్రితమే కొందరు బీజేపీ నేతలు, రాజకీయ పరిశీలకులు తనకు చెప్పారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు ఇటు జాతీయ మీడియాతో పాటు అటు పాకిస్థాన్ మీడియా కూడా ప్రముఖంగా ప్రచురించింది. అయితే ఇది తన అభిప్రాయం కాదని.. కొందరు రాజకీయ పరిశీలకు, విశ్లేషకులు పవన్ కల్యాణ్ తో పంచుకున్న అభిప్రాయాలని తాజాగా జనసేన పార్టీ వివరణ ఇచ్చింది.

ఈ వ్యాఖ్యాల విషయంలో జాతీయ మీడియా రంధ్రాన్వేషణ చేస్తోందని, దేశానికి సంబంధించిన విషయంలో ఎవరు ఎలాంటి కామెంట్లు చేసినా.. మీడియా తనకున్న పరిధి మేరకు కాసింత నిగ్రహాన్ని పాటించాల్సిన అవసరం వుందని పార్టీ వర్గాలు పేర్కోన్నాయి. తాను చేసిన వ్యాఖ్యలు తన అభిప్రాయాలుగా పేర్కోనడం కూడా సముచితం కాదని, తనకు రాజకీయ పరిశీలకులు, రాజకీయ విశ్లేషకులు తెలిపిన అభిప్రాయాలేనని.. దీనిని జాతీయ మీడియా ఎందుకు హైలెట్ చేయలేదని పార్టీ వర్గాలు ప్రశ్నించాయి.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించవద్దని జనసేన జాతీయ మీడియాకు విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించవద్దని కోరింది. ఈ సందర్భంగా గత నెల 28న ఓ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..‘యుద్ధం వస్తుందని పాకిస్థాన్ వాళ్లు మాట్లాడుకుంటుంటే నేనేమన్నా విన్నానా? అంతర్జాతీయ సంస్థ లేమన్ బ్రదర్స్ కుప్పకూలిపోయిన నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందని కొందరు నిపుణులు ముందుగానే అంచనా వేశారు.

భారత్ పాకిస్థాన్ ల మధ్య యుద్దం రాబోతోందని రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. ఇంటర్నెట్ లో కథనాలు సైతం అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయ రాజకీయాలను పరిశీలిస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. ఇరుదేశాల మధ్య యుద్ధం రాబోతోందన్నది నా అంచనా కాదు. కొందరు రాజకీయ పరిశీలకుల అంచనా మాత్రమే’ అని జనసేనాని చెప్పిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  national media  pakistan media  Narendra Modi  Indian Armed Forces  BJP  Politics  

Other Articles