Flight operations suspended at border airports సరిహద్దు విమానాశ్రయాల మూసివేత.. మిగిలిన చోట్ల హైఅలర్ట్..!

Border airports closed for civilian flights remainging on high alert

Jammu and Kashmir, States and union territories of India, India, Tourism in Jammu and Kashmir, Sheikh ul-Alam International Airport, Srinagar, Jammu, Ladakh, Chandigarh Airport, Leh, Chandigarh, National Highway 1D, Indian Air Force, Amritsar, Pakistan air strikes, leh, Indian airports, Indian Air Force, iaf jet crashing, IAF air strikes in Pakistan, IAF, Airports shut down, airport shut down, air strikes on pakistan

Due to airspace restrictions, flights to and from Amritsar, Srinagar, Chandigarh and Jammu are currently on hold, Vistara Airlines Limited said in a tweet. Even Pakistan stops its domestic and international flight operations from Lahore, Multan, Faisalabad, Sialkot and Islamabad airports.

సరిహద్దు విమానాశ్రయాల మూసివేత.. మిగిలిన చోట్ల హైఅలర్ట్..!

Posted: 02/27/2019 01:05 PM IST
Border airports closed for civilian flights remainging on high alert

పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 యుద్దవిమానాలను భారత వాయుసేన వెంటాడి కూల్చేసిన నేపథ్యంలో దాయాధి మరిన్ని దాడులకు తెగబడవచ్చునన్న నిఘావర్గాల హెచ్చరికలతో జమ్మూ కాశ్మీర్ సహా సరిహద్దు రాష్ట్రాలలోని పలు విమానాశ్రయాలను కేంద్రప్రభుత్వం మూసివేసింది. వీటితో పాటు మిగిలిన విమనాశ్రయాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. మూసివేసిన విమానాశ్రయాల్లో జమ్ము, శ్రీనగర్, లేహ్, అమ్రిస్టర్, ఢిల్లీ ఎయిర్ స్పేస్ ను మూసివేస్తున్నట్టు రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు.

సర్జికల్‌  స్ట్రయిక్స్‌, సరిహద్దులో యుద్ధమేఘాలు, పాక్‌ కవ్వింపు చర్యల నేపధ్యంలో తిరిగి ప్రకటించేంత వరకూ ఎయిర్ స్పేస్ తెరచుకోదని స్పష్టం చేశాయి. కమర్షియల్ విమానాలన్నింటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపారు. ఈ ఉదయం పాకిస్థాన్ కు చెందిన విమానాలు భారత భూభాగంవైపు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. విమాన సర్వీసులన్నింటినీ రద్దు చేస్తున్నామని, శ్రీనగర్ తదితర విమానాశ్రయాలకు చేరుకోవాల్సిన విమానాలను దారి మళ్లించామని పేర్కొంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో భద్రత కట్టుదిట్టం చేశారు. పూల్వామా దాడికి ప్రతీకారంగా ఉగ్ర స్థావరాలపై భారత్‌ దాడులు, పాకిస్థాన్ యుద్దవిమానాల కూల్చివేత నేపథ్యంలో అక్కసుతో ఉన్న పాక్‌ ఏదైనా దారుణానికి వడిగడుతుందేమో అన్న అనుమానంతో నిఘా పటిష్టం చేశారు. విమానాశ్రయం, రైల్వేస్టేషన్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో అదనంగా సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి నిఘా పర్యవేక్షిస్తున్నారు. పాఠశాలలు, పరిశ్రమలకు ఏ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ప్రజలు ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అనుమానితులు కనిపిస్తే మాత్రం పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles