'Not concerned if India stops flow of water': Pakistan సింధు నీళ్లు అపితే.. తమకేమీ నష్టంలేదన్న పాక్..

Not concerned if india diverts water from 3 eastern rivers says pakistan

Imran Khan, indus water treaty, Jaish-e-Mohammad, Nitin Gadkari, pakistan, Pulwama terror attack

Pakistan has said it is not concerned if India diverted the waters of Beas, Ravi and Sutlej a day after Union Minister Nitin Gadkari said the country had decided to fully utilise its share of unused water from the rivers.

సింధు నీళ్లు అపితే.. తమకేమీ నష్టంలేదన్న పాక్..

Posted: 02/22/2019 05:30 PM IST
Not concerned if india diverts water from 3 eastern rivers says pakistan

పుల్వామా దాడిపై ఆగ్రహంగా ఉన్న భారత్‌ సింధూ జలాల ఒప్పందం కింద దక్కిన నదీ జలాల్లోని మన వాటా నీటిని పాకిస్థాన్ కు ప్రవహించకుండా ఆపెయ్యాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాయాధి దేశం పాకిస్థాన్ దీనిపై భిన్నంగా స్పందించింది. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తాము ఉగ్రవాద బాధితులమే అంటూ చేసిన వ్యాఖ్యలకు.. సింధూ నది జలాలపై స్పందించిన తీరుకు అసలు పొంతన లేకుండా వుంది.

ఉగ్రవాదులు పుల్వామాలో దుశ్చర్యకు పాల్పడి 40 మంది జవాన్ల ప్రాణాలను బలిగొన్న తరుణంలో.. ఇందుకు తమ దేశప్రజలు కూడా భారం మోయాల్సి వస్తుందని వ్యాఖ్యానించాల్సిన పాకిస్తాన్.. అందుకు భిన్నంగా ఉగ్రవాదులకు ఊతమిచ్చినట్లుగా.. వారి చర్యకు మద్దతు పలికినట్లుగా వ్యవహరించడం.. పలు ప్రశ్నలకు తావిస్తోంది. భారత్‌ నీళ్లు మళ్లించుకున్నంత మాత్రాన తమకు వచ్చిన నష్టమేమీ లేదని వ్యాఖ్యానించడం.. తమ దేశ ప్రేరేపిత ఉగ్రవాదులకు మరింత బలాన్ని అందించినట్లేనని భారతీయులు కామెంట్లు చేస్తున్నారు.

నదీ జలాలపై తాము ఎలాంటి ఆందోళనా చెందడం లేదని పాక్‌ నీటిపారుదలశాఖ సెక్రటరీ ఖవాజా షుమాలి వ్యాఖ్యానించారు. ఈ మేరకు పాక్‌ పత్రిక డాన్‌తో ఆయన మాట్లాడారు. ‘‘తూర్పు ప్రాంత నదుల జలాల్ని మళ్లించడంపై మాకు ఎలాంటి అభ్యంతరమూ, ఆందోళనా లేదు. భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల మేమేమీ చింతిండం లేదు. మేం ఉపయోగించుకునే సింధు, జీలం, చీనాబ్‌ నదీ జలాల నీటిని అడ్డుకుంటే మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తామని అన్నారు.

ఈ మూడు నదుల నీటిని మళ్లించిన క్రమంలో తాము అభ్యంతరం వ్యక్తం చేస్తామన్నారు. 1960లో కూడా తూర్పు ప్రాంత నదుల జలాల్ని వారి కోసం మళ్లించుకున్నారు. ఆ సమయంలో మేమేమీ అభ్యంతరం చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అదే పని చేస్తున్నారని.. దీంతో తమకేమీ ఇబ్బంది లేదని అన్నారు. దేశానికి సాగు, తాగు నీరు జాలాలు రావడంతో ఆ ప్రాంతం సస్యశ్యామలంగా మార్చుకోవాల్సిన పాక్.. అందుకు బదులు తీవ్రవాదన్ని కోనసాగిస్తాం.. నీళ్లు అపితే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

సింధూ జల ఒప్పందంలో భాగంగా సింధు, జీలం, చీనాబ్‌ నదులు పాక్ కు దక్కగా, రావి, బియాస్‌, సట్లెజ్‌ నదులు భారత్ కు దక్కాయి. పుల్వామా దాడి నేపథ్యంలో మనదేశంలోని తూర్పు ప్రాంతంలో ప్రవహించే నదీ జలాల్ని పాకిస్థాన్ కు వెళ్లకుండా నిలువరించాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. ఆ నీటిని మళ్లించి జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌ ప్రజలకు అందిస్తామన్నారు. ‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles