Man burnt alive as moving car catches fire on ORR ఓఆర్ఆర్ పై కారు ప్రమాదం.. వ్యక్తి సజీవదహనం..

Man charred to death as moving car catches fire in hyderabad

Man charred to death in moving car, Maruti Celerio, Sultanpur village, Ameenpur, Sangareddy district, SP Chandrasekhar Reddy, Outer Ring Road, Sridevi, Ganta Venkatagiri, TS 07 4666, Maruti celerio, fire tenders, Ameenpur police, crime

A person died when a car in which he was travelling in suddenly caught fire at Outer Ring Road in Hyderabad. Maruti Celerio hatchback caught fire. The mishap occurred on the ORR at Sultanpur village of Ameenpur mandal in Sangareddy district.

ITEMVIDEOS: ఓఆర్ఆర్ పై కారు ప్రమాదం.. వ్యక్తి సజీవదహనం..

Posted: 02/20/2019 03:56 PM IST
Man charred to death as moving car catches fire in hyderabad

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరం చుట్టూ ప్రాంతాలను కలుపుతూ స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించిన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు.. ప్రస్తుతం ప్రమాదాలకు నెలవుగా మారింది. ఆ మధ్యకాలంలో వేగంగా వస్తున్న కార్లు ప్రమాదానికి గురికాగా, ఆ తరువాత కార్ల అద్దాలు ఎవరో దాడి చేసినట్లుగా ధ్వంసం కాగా, ఇక తాజాగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి కార్లు దగ్థం అవుతున్నాయి.

తాజాగా సంగారెడ్డి మండలం అమీన్ పూర్ మండల పరిధిలోనూ ఇదే తరహా ప్రమాదంలో ఒక వ్యక్తి సజీవదహనం అయ్యాడు. ఔటర్‌ రింగ్‌రోడ్డు పైనుంచి వేగంగా వస్తున్న కారు అమీన్ పూర్ మండలం సుల్తాన్ పూర్ వద్దకు చేరుకున్న క్రమంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలో మంటలు భీకరస్థాయిలో చెలరేగడంతో కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవింగ్ చేస్తున్న వెంకటగిరి కూడా సజీవ దహనమయ్యాడు.

బాచుపల్లి గౌరంపేట ప్రాంతంలోని గంటి వెంకటగిరి అనే వ్యక్తి జూబ్లీహిల్స్ లోని గంగవరం పోర్ట్ కార్యాలయానికి వెళ్లేందుకు సెలిరియో కారులో బొల్లారంలోని ఓఆర్ఆర్ ఎక్కాడు. కిలో మీటరు ప్రయాణించాక కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమయానికి కారు డోర్‌ ఓపెన్‌ కాకపోవడంతో.. వెంకటగిరి మంటల్లో చిక్కకుని సజీవదహనం అయ్యాడు. కారులో షార్ట్ సర్యూట్‌ అయినట్టు పోలీసులు భావిస్తున్నారు.

అయితే రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ కూడా ఘటనస్థలాన్ని పరిశీలించింది. టీఎస్ 07 4666 రిజిస్ట్రేషన్ నెంబరు గల కారు భార్య శ్రీదేవి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి ఉంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనాస్థలికి చేరకున్న సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ప్రమాదానికి గల కారణాలను కూడా తమ దర్యాప్తు బృందం అన్వేషిస్తోందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles