KCR inducts 10 Ministers into Cabinet 6 కొత్తవారు.. 4 పాతవారితో కేసీఆర్ క్యాబినెట్

Telangana cabinet to be mix of 4 old hands and 6 newbies

indrakaran reddy, chief minister, constitution, errabelli dayakar rao, etela rajender, former minister, g jagadish reddy, home minister, hyderabad, hyderabad latest news, indrakaran reddy, k chandrashekhar rao, koppula eashwar, mohammad mahmood ali, pocharam srinivas reddy, prashant reddy, speaker, srinivas yadav, state assembly, t padma rao goud, talasani srinivas yadav, telangana, telangana news, telangana rashtra samithi, telangana today, telangana today news, vemula prashanth reddy, Social media, Politics

Chief Minister K Chandrashekhar Rao inducted 10 Ministers into his team in the first Cabinet expansion after he took over the reins of the State administration for a second consecutive term in December. With today’s expansion, the strength of the Cabinet has gone up to 12 including the CM.

6 కొత్తవారు.. 4 పాతవారితో కేసీఆర్ క్యాబినెట్

Posted: 02/19/2019 12:33 PM IST
Telangana cabinet to be mix of 4 old hands and 6 newbies

తెలంగాణ రాష్ట్రానికి రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టిన తరువాత 66 రోజులకు తన క్యాబినెట్ ను ఏర్పాటు చేసుకున్నారు సీఎం కేసీఆర్. తన తొలి క్యాబినెట్ విస్తరణలో కేవలం నలుగురు పాత మంత్రులకు స్థానం కల్పించిన సీఎం.. ఆరుగురు కొత్తవారికి కూడా క్యాబినెట్ లో చోటు కల్పించారు. ఇవాళ ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో కొత్త మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు.

నూతన మంత్రులుగా అల్లోళ్ల ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వీ శ్రీనివాస్‌ గౌడ్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, మల్లారెడ్డిలు ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణం చేసిన ప్రతిఒక్కరూ గవర్నర్ కు అభివాదం చేసి, ఆపై కేసీఆర్‌ కు కృతజ్ఞతలు తెలిపి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. కొందరు కాళ్లకు నమస్కరించబోగా, కేసీఆర్ వారిని వారించారు.

దాదాపు 1200 మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ మధ్యాహ్నం తరువాత కొత్త మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాగా ఇప్పటికే ఎవరెవరికీ ఏయే శాఖలు కేటాయిస్తున్నారో లీకులు మాత్రం వస్తున్నాయి.

నిరంజన్ రెడ్డి - ఆర్థిక శాఖ
ప్రశాంత్ రెడ్డి - పరిశ్రమల శాఖ
కొప్పుల ఈశ్వర్ - విద్యాశాఖ
ఎర్రబెల్లి దయాకర్ రావు - వ్యవసాయ శాఖ
జగదీశ్వర్ రెడ్డి - రోడ్లు, భవనాల శాఖ
తలసాని శ్రీనివాస్ యాదవ్ - పౌర సరఫరాల శాఖ
ఇంద్రకరణ్ రెడ్డి - వైద్య ఆరోగ్య శాఖ
మల్లారెడ్డి - విద్యుత్ శాఖను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ నెల 22 నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ శాసనసభ సమావేశాలు కూడా జరగనున్నాయి. ఈ సమావేశాలలో ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టనుందని తెలుస్తుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  KTR  Harish Rao  Cabinet Expansion  ESL Narasimhan  Raj Bhavan  Telangana  Politics  

Other Articles