Hero Gopichand met with an accident హీరో గోపిచంద్ కు షూటింగ్లో ప్రమాదం..

Hero gopichand met with an accident

Hero Gopichand, Gopichand spy thriller, Gopichand accident, Gopichand jaipur forties hospital, Thiru Subrahmanyam Gopichand, accident, thiru subrahmanyam, jaipur, rajasthan, tollywood

Hero Gopichand is currently shooting for a spy thriller under Tamil director Thiru Subrahmanyam’s direction met with an accident. As per the reports, while shooting for an action block in Rajasthan this incident happened and Gopichand is immediately rushed to a local hospital for initial treatment.

హీరో గోపిచంద్ కు షూటింగ్లో ప్రమాదం..

Posted: 02/18/2019 01:37 PM IST
Hero gopichand met with an accident

టాలీవుడ్ హీరో, స్వర్గీమ విప్లవాత్మక డైరెక్టర్ టి కృష్ణ తనయుడు గోపీచంద్ కు ప్రమాదం సంభవించింది. స్వతహాగా రిస్క్ సీన్లను కూడా డూప్ లు లేకుండా తామే తీస్తున్న తెలుగు యువహీరోలలో గోపిచంద్ కూడా అలాంటి రిస్క్ ను తీసుకున్నాడు. తన తదుపరి చిత్రం కోసం సినిమా షూటింగ్ లో పాల్గోన్న ఆయన షూటింగ్ లో భాగంగా జైపూర్ దగ్గర ఉన్న మాండవలో ఆయన కొత్త సినిమా చిత్రీకరణ జరుగుతొంది.

ఈ సందర్భంగా బైక్ పై ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా, బైక్ స్కిడ్ అయి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హీరో గోపీచంద్ కు గాయాలయ్యాయి. దీంతో వెంటనే చిత్ర నిర్మాణ యూనిట్ గాయపడిన గోపిచంద్ ను అసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. ఆ తరువాత చిత్ర నిర్మాణ యూనిట్ సభ్యులు గోపిచంద్ బైక్ చేజింగ్ సీన్ లో బైక్ స్కిడ్ కావడంతో స్వల్పంగా గాయపడ్డారని తెలిపారు.

అయితే గోపీచంద్ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని, గాయాలకు చికిత్స చేయించుకున్న తర్వాత షూటింగ్ లో పాల్గొనవచ్చునని అక్కడి ఫోర్టీస్ ఆసుపత్రి వైద్యులు తెలిపారని కూడా తెలిపారు. కాగా, చికిత్స తరువాత ఆయనకు విశాంత్రిని కల్పించామని చెప్పారు. ఇవాళ్టితో జైపూర్ లో షూటింగ్ పూర్తికానుంది. ప్రస్తుతం అనిల్ సుంకర నిర్మిస్తున్న భారీ యక్షన్ చిత్రంలో గోపీచంద్ నటిస్తున్నాడు. తిరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopichand  accident  thiru subrahmanyam  jaipur  rajasthan  tollywood  

Other Articles