Tell where to send cash: BSY to MLA son ‘‘పదవికి రిజైన్ చేస్తే పది కోట్లు.. మంత్రి పదవి..’’

Bjp operation lotus yeddurappa caught again in audio tapes

sharana gowda, Yeddyurappa, Kumara Swamy, Siddaramaiah, B.S. Yeddyurappa, Naganagouda Kundkur, Gurmitkal, BJP, Congress, JD(S), karnataka assembly, pro tem speaker, mukhul rothagni, kapil sibal, assembly speaker, speaker election, congress mlas, jds mlas, BS Yeddyurappa, Siddaramaiah, governor, vajubhai wala, Congress, BJP, JDS, Kumara Swamy, hyderabad, kochi, PM Modi, Amit shah, karnataka, politics

The JD(S) released the full ! hour 20-minute recording, purportedly of BJP state president BS Yeddyurappa and BJP legislator Shivanagouda Naik trying to lure Sharanagouda Kundkur, son of JD(S) legislator Naganagouda Kundkur of Gurmitkal.

‘‘కర్ణాటకలో ప్రలోభాల పర్వం.. కాదేదీ రాజకీయ అనర్హం’’

Posted: 02/14/2019 05:29 PM IST
Bjp operation lotus yeddurappa caught again in audio tapes

కర్ణాటకలో బీజేపి అగ్రనేతలపై అధిష్టానం కత్తి పెట్టిందా.? ఎలాగైనా రాష్ట్రంలోని కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టి.. బీజేపి ప్రభుత్వాన్ని నెలకొల్పాన్న వాంఛతో వుందా.? అందుకనే అక్కడ జరుగుతున్న బేరసారాలు, ప్రలోభాలు వెలుగులోకి వస్తున్నా.. వాటిపై కిమ్మనకుండా వుండిపోయిందా.? అంటే అవునన్న సంకేతాలే వస్తున్నాయి. అదిష్టానం అదేశాలతోనే రాష్ట్రంలోని బీజేపి అగ్రనేతలు శతవిధాలా ప్రయత్నాలు చేసి కుమారస్వామి ప్రభుత్వానికి కంటిమీద కునుకు కరువయ్యేలా చేస్తున్నారని విమర్శలు వినబడుతున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పార్లమెంటు నిండు కొలువులో చెప్పినట్లు తమ ప్రభుత్వంలో ధర్మం, నీతి, న్యాయం నాలుగు పాదాలపై నడుస్తుందన్న మాటలు నిజమే అయితే.. వాటికి కర్ణాటకలో విఘాతం కలిగించే తన సోంత పార్టీ నేతలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కన్నడ నాట బీజేపి చేస్తున్న చర్యలు అక్కడి ప్రజల్లో బీజేపి పట్ల హేయభావం కలిగేలా చేస్తున్నాయన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా కేవలం అధికారమే పరమావధి అన్నట్లుగా.. ఎందుకు వ్యవహరిస్తుందో అన్న విషయం కూడా కన్నడిగులకు తెలిసిందే.

తాజాగా జేడీఎస్ - కాంగ్రెస్ కూటమిని గద్దెదించాలన్న ఉద్దేశంతో ప్రలోభాలకు దిగిన బీజేపీ నేతల ఆడియోలు ఇప్పుడు రాష్ట్రంలో కాక రేపుతున్నాయి. జేడీఎస్ ఎమ్మెల్యేలను యడ్యూరప్ప ప్రలోభ పెడుతున్న తాజా ఆడియో టేప్ వెలుగులోకి వచ్చింది. ఈ నెల 8న ఓ ఆడియోను సీఎం కుమారస్వామి విడుదల చేయగా, ఈ తాజా టేపును జేడీఎస్ వర్గాలు బయటపెట్టాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే రూ. 10 కోట్లు ఇవ్వడంతో పాటు, ఆపై టికెట్ ఇచ్చి గెలిపించుకుని మంత్రి పదవి ఇస్తానని యడ్యూరప్ప ఆఫర్ చేస్తున్నట్టుగా ఇందులో ఉంది.

ఎమ్మెల్యే శరణగౌడతో మాటలకు దిగిన యడ్యూరప్ప, తొలుత మీ నాన్నతో మాట్లాడి రాజీనామాకు ఒప్పించాలని, ముంబైకి వెళ్లి, 15 మంది ఎమ్మెల్యేలను కలుపుకుని ఒకేసారి రాజీనామా చేస్తే, తొలుత ఇంటికి రూ. 20 కోట్లు పంపుతామని ఆయన చెప్పినట్టుగా వినిపిస్తోంది. ఆర్థిక వ్యవహారాలను తన కుమారుడు విజయేంద్ర చూసుకుంటాడని, లోక్ సభ ఎన్నికల తరువాత జేడీఎస్ కనిపించదని యడ్యూరప్ప అన్నట్టుగా ఉంది.

తాను రాజీనామా చేస్తే స్పీకర్ అంగీకరించకపోవచ్చని ఎమ్మెల్యే శివనగౌడ అభ్యంతరం చెప్పగా, దాని గురించి ఆలోచించ వద్దని, ఆ సంగతిని పెద్దలు చూసుకుంటారని భరోసా ఇచ్చారు. ప్రధాని, అమిత్ షా, గవర్నర్ లు మిగతా కథ నడిపిస్తారని అన్నారు. రాయచూర్ లో ఉన్న మార్వాడీల ద్వారా రూ. 20 కోట్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆడియో టేపులు ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sharana gowda  Yeddyurappa  Kumara Swamy  Siddaramaiah  BJP  Congress  JD(S)  karnataka  politics  

Other Articles