MP Avanti Srinivas to leave TDP? ఆమంచి బాటలో అనకాపల్లి ఎంపీ..?

Tdp anakapalli mp likely to join ysr congress

TDP, YSR Congress Party, Avanthi Srinivas, Anakapally, Amanchi KrishnaMohan, Bheemili, Vishakapatnam, AP elections 2019, politics

TDP MP from Anakapally Parliamentary constituency Avanthi Srinivas is likely to join YSR Congress Party as the leader was not happy with the party high command.

ఆమంచి బాటలో అనకాపల్లి ఎంపీ.. విశాఖ నేతలకు పిలుపు..

Posted: 02/14/2019 11:15 AM IST
Tdp anakapalli mp likely to join ysr congress

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా సంయుక్తంగా సమీపిస్తున్న సమయంలో రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో.. టీడీపికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం తమ గమ్యాన్ని మార్చుకుంటున్నారు. నిన్నటి వరకు అధికార పార్టీలో వున్న పలువురు టీడీప నేతలు.. వైస్సార్ సిపీ పార్టీలో చేరేందుకు సిద్దం అవుతునన్నారు.

చీరాల ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరి ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్న సందర్భంగా.. మరికోందరు టీడీపీ నేతలు కూడా ఆ పార్టీలో మనజాల లేకపోతున్నారని, వారు కూడా త్వరలోనే పార్టీని వీడనున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలు కూడా గడవకముందే అనకాపల్లి సిట్టింగ్ ఎంపీ అవంతి శ్రీనివాస్ అదే దారిలో నడుస్తున్నారు. కాగా, ఇవాళ అవంతి శ్రీనివాస్ హైదరాబాద్, లోటస్ పాండ్ కు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తో భేటీ కానున్నారు.

ఆయనకు విశాఖపట్నం ఎంపీ స్థానం లేదా భీమిలి టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో విశాఖపట్నం వైసీపి ముఖ్య నేతలను జగన్ హైదరాబాద్ కు పిలిపించారు. తొలుత వారితో మాట్లాడిన తరువాతనే అవంతి శ్రీనివాస్ తో జగన్ సమావేశం అవుతారని తెలుస్తోంది. అయితే ఉత్తరాంధ్రలో కూడా టీడీపీకి భారీగా దెబ్బపడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు మాత్రం అంతకు సమర్ధులైన నేతలను బరిలో నిలిపేందుకు రెడీ అవుతున్నారు.

కాగా ఆమంచి కృష్ణమోహన్ గత ఎన్నికలలో స్వతంత్రుడిగా గెలిచి తమ పార్టీలోకి వచ్చిన నేతని.. ఇలాంటి నేతలు ఏ చోటా ఒక పట్టాన వుండరని టీడీపీ వర్గాలు పేర్కోంటున్నాయి. ఇక అదే బాటలో నడిచిన అవంతి శ్రీనివాస్ కూడా ప్రజారాజ్యం నుంచి 2009లో భీమిలి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలిచి ఆ తరువాత కాంగ్రెస్ లోకి వెళ్లి.. అక్కడి నుంచి గత పర్యాయం అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ పార్టీలోకి చేరారని టీడీపీ వర్గాలు పేర్కోంటున్నాయి. వీరు పార్టీని వీడటంలో పార్టీలోని నేతలకు ఇప్పుడు అవకాశం లభించిందని వ్యాఖ్యానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  YSRCP  Avanthi Srinivas  Anakapally  Bheemili  AP elections 2019  politics  

Other Articles