Why No Bharat Ratna for NTR since 22 Years? తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు

That s why no bharat ratna for ntr tammareddy bharadwaj

Bharat Ratna for NTR, Tammareddy Bharadwaj, Chandrababu Naidu, Lakshmi parvathi, That's why no Bharat Ratna for NTR?, Tammareddy Reveals Few Facts of AP CM Chandrababu Naidu TDP","NTR","Tammareddy Bharadwaj","Tammareddy Latest Videos","Tammareddy Bharadwaj Interview, Social media, Politics

Tollywood Veteran Director Tammareddy Bharadwaj says, TDP founder and former Chief Minister of AP late NT Rama Rao, who made an invaluable contribution to the uplift of downtrodden sections, deserves the country's highest civilian award Bharat Ratna.

ITEMVIDEOS: ఎన్టీఆర్ కు భారతరత్నపై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు

Posted: 02/11/2019 05:32 PM IST
That s why no bharat ratna for ntr tammareddy bharadwaj

ప్రముఖ దర్శకనిర్మాత, రాజకీయ విశ్లేషకుడు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనలో ఉత్పన్నమయ్యే వివిధ ప్రశ్నలు, అభిప్రాయాలను ఆయన తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా గత కొంత కాలంగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో గత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రుల ఆరాధ్యుడు ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని పదేపదే డిమాండ్ వస్తున్న క్రమంలో ఆయన సంచలన విషయాలను ప్రస్తావించారు.

ఎన్టీఆర్ తెలుగువారిని వదిలి 22 ఏళ్లు కావస్తున్నా ఆయనకు ఇప్పటి వరకు భారతరత్న అవార్డు దక్కకపోవడంపై అవేదన వ్యక్తం చేసిన ఆయన.. దానిని రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే అని అనుమానం కలుగుతుందంటూ.. అందుకు గల కారణాలను కూడా విశ్లేషించారు. ‘నా ఆలోచన’ అనే యూట్యూబ్ చానల్ లో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. రిపబ్లిక్ డే రోజున ప్రకటించిన పురస్కారాల్లో ఎన్టీరామారావు పేరు లేకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారని అన్నారు.

అయితే తనకు ఈ విషయంలో తనకు ఆయనపైనే అనుమానం ఉందని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లు ఎన్డీయేలో ఉన్న చంద్రబాబుకు భారతరత్న ఇప్పించడం పెద్ద విషయం కాదని తమ్మారెడ్డి పేర్కొన్నారు. అవార్డులు ప్రకటించేంత వరకు సైలెంట్ గా ఉండి, ఆ తర్వాత హడావుడి చెయ్యడం వెనక పెద్ద స్టోరీనే ఉందని అనిపిస్తోందని తమ్మారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటిస్తే కుటుంబం మొత్తం వెళ్లాల్సి వుంటుందని అన్నారు. కాగా ఢిల్లీకి వెళ్లడం అన్నగారి కుటుంబ సభ్యులకు పెద్ద విషయం కాదన్న ఆయన అక్కడే ఒక మెలిక వుందని గుర్తిచేశారు.

అదేంటంటే ఎన్టీఆర్ కు ఇచ్చే అవార్డును ఆయన సతీమణి లక్ష్మీపార్వతి అందుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ పురస్కారాన్ని లక్ష్మీపార్వతి అందుకోవడం ఇష్టం లేదని, అందుకనే కావాలనే ఈ విషయంలో చంద్రబాబు జాప్యం చేస్తున్నట్టు అనుమానంగా ఉందని పేర్కొన్నారు. భారతరత్న వద్దనుకుంటే దానిని అక్కడితో వదిలేయాలి కానీ ఈ రాద్ధాంతం ఎందుకని భరద్వాజ ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు చెప్పుకుని చాలామంది బతుకుతున్నారని, కాబట్టి ఆయనను భ్రష్టుపట్టించవద్దని తమ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bharat Ratna  NTR  Tammareddy Bharadwaj  Chandrababu  Lakshmi parvathi  Politics  

Other Articles