'Interim Budget Has No Value', Says Mamata Banerjee మధ్యంతర బడ్జెట్ కు విలువ లేదన్న మమతా బెనర్జీ

Giving farmers rs 17 a day is their insult rahul gandhi on budget 2019

budget 2019, budget 2019, budget, economic survey 2019, Interim budget, Union budget, rahul gandhi, manmohan singh, chidambaram, union budget 2019, piyush goyal, budget 2019 expectations, interim budget 2019, interim budget 2019 High lights, finance minister of india 2019, finance minister of india, vote on account, politics

Congress president Rahul Gandhi described as “an insult” the Modi government’s announcement in Budget 2019 to give small and marginal farmers Rs 6,000 annually. Rahul said the amount translates to Rs 17 a day which is a complete insult to farmers.

‘‘పారిశ్రామక వేత్తలకు కోట్లు.. రైతులకు రూ. 17?’’: రాహుల్

Posted: 02/01/2019 06:32 PM IST
Giving farmers rs 17 a day is their insult rahul gandhi on budget 2019

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా రైతులకు ఏడాదికి రూ. 6000 ఇవ్వనున్నట్లు బడ్జెట్ లో ప్రకటించడం రైతులను అవమానించడమేనని అన్నారు. గత ఐదేళ్ల కాలంలో ప్రజలకు అకౌంట్లలో రూ.15 లక్షల రూపాయాలు వేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.

రైతులపై ప్రేమ కేవలం ఎన్నికల ముందే కలిగిందా.? గత ఐదేళ్లుగా వారిని కనీసం పట్టించుకకుండా వదిలేశారని విమర్శించారు. దేశంలోని రైతులందరూ హస్తినకు వచ్చి మరీ తమ నిరసన తెలిపినా పట్టని ప్రభుత్వం.. కేవలం ఎన్నికల ముందు మాత్రం వారికి తాయిలం ప్రకటించారని దుయ్యబట్టారు. ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం అనంతరం.. రాహుల్ ట్వీట్ చేశారు. రైతుల జీవితాలను మోదీ సర్కారు నాశనం చేసిందని ఆరోపించారు. దీంతో ఆయన ట్విట్టర్ ద్వారా ఈ మేరకు స్పందించారు.

‘డియర్‌ నోమో (నరేంద్ర మోదీ). ఐదేళ్ల మీ అసమర్థత, అహంకారం రైతుల జీవితాలను నాశనం చేసింది. రైతులకు రోజుకు కేవలం రూ.17 ఇవ్వడమంటే వారిని పూర్తిగా అవమానించడమే’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ప్రధానిగా మోదీకి ఇదే చివరి బడ్జెట్ అని రాహుల్ జోస్యం చెప్పారు. ఎన్నికల ముందు మోదీ ప్రకటించిన గారడీల బడ్జెట్ అని విమర్శించారు. ప్రధాని మోదీని బీజేపీ నేతలు ‘నమో’గా సంబోధించే విషయం తెలిసిందే. రాహుల్ ఈ పేరును కూడా ఎద్దేవా చేస్తూ ‘నోమో’ అని పేర్కొనడం గమనార్హం. ఎన్నికల తర్వాత కేంద్రంలో మోదీ ఉండరనేది రాహుల్ ఉద్దేశం కావొచ్చు.

కేంద్రం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ప్రజలను మోసగించేలా ఉందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఓ వైపు స్కిల్ ఇండియా అంటూనే ఈ బడ్జెట్ కు సంబంధించి నైపుణ్యాభివృద్ధి రంగంలో కోతలు విధించారని అమె అరోపించారు. కేంద్రం తమ పథకాలనే కాపీ కొట్టిందని, పశ్చిమబెంగాల్ లో తాము ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలనే కేంద్రం కొత్తగా ప్రకటించిందని విమర్శించారు.

సమాఖ్య వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, రాష్ట్రాలను సంప్రదించకుండానే ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. కేంద్ర పథకం అని చెప్పుకుంటున్న ‘ఆయుష్మాన్ భారత్’, పశ్చిమ బెంగాల్ లో ముందు నుంచే అమల్లో ఉందని, ఆరోగ్య పథకం కింద రూ.5 లక్షల వరకు అమలు చేస్తున్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. రాష్ట్రాలు చేసిన మంచిని కూడా కేంద్ర ప్రభుత్వం తమ గొప్పలుగా చెప్పుకుంటోందని, మోదీ ప్రభుత్వానికి ప్రచార యావ తప్ప, ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదని దుయ్యబట్టారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Interim budget  Union budget  rahul gandhi  mamta banerjee  piyush goyal  politics  

Other Articles