Senior Congress Leaders approach High Court హైకోర్టును ఆశ్రయించిన సీనియర్ కాంగ్రెస్ నేతలు

Senior congress leaders approach high court on election irregularities

Election commission of India, chief election officer, CEO, Evms, VVPAT Machines, EVM hacking, EVM tampering, VVPAT slips counting, DK Aruna, Revanth Reddy, Dasoju Shravan, High Court, Congress, Telangana Politics

Senior Congress Leaders approach High Court on Election Irregularities accusing that Election Commission has not taken any action even after their repeated compliants on Hacking, counting irregularities.

హైకోర్టును ఆశ్రయించిన సీనియర్ కాంగ్రెస్ నేతలు

Posted: 01/24/2019 05:57 PM IST
Senior congress leaders approach high court on election irregularities

గత ఏడాది డిసెంబర్ 7న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అదే నెల 11న వెలువడిన ఫలితాలలో అవకతవకలు జరిగాయంటూ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన లేకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు హైకోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి డీకే ఆరుణ, టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఎన్నికలలో తమ నియోజకవర్గాలలో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ వచ్చాయని అరోపించారు మాజీ మంత్రి డికే అరుణ. ఇలా తేడా రావడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని అమె తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. అయితే ఈ విషయమై ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి నుంచి సరైన స్పందన రాలేదని.. అమె తన పిటీషన్లో పేర్కొన్నారు.

ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలతో కొడంగల్ లో గెలిచిన నరేందర్‌ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ రేవంత్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనతో పాటు కౌంటింగ్ లో అవకతవకలకు పాల్పడిన వారిపై అనర్హత వేటు వేయాలని శ్రవణ్‌ వ్యాజ్యం వేశారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు వేసిన ఓట్లకు విలువ వుంటుందనే.. మరి అదనపు ఓట్లు విలువ ఎక్కడిదని.. వాటిని కలుపుకుని ఓట్లను లెక్కింపు ఎలా సాధ్యమని వారు ప్రశ్నించినట్లు కాంగ్రెస్ వర్గాలు ప్రశ్నించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : EVM hacking  DK Aruna  Revanth Reddy  Dasoju Shravan  High Court  Congress  Telangana Politics  

Other Articles