Rajan believes India will overtake China's economy చైనాను భారత్ ఆర్థికవృద్ది దాటేస్తుంది: రాఘురామ్ రాజన్

India to become bigger than china eventually raghuram rajan

raghuram rajan, india gdp growth, china gdp growth, india-china economy, former rbi governor, wef annual meeting 2019, World Economy Federation Annual Meet, World Bank, india economy, South Asian countries

Rajan was addressing a session on Strategic Outlook for South Asia during which he shared his observation, further claiming that the Indian economy would continue to grow while the growth rate in China is decelerating.

చైనాను భారత్ ఆర్థికవృద్ది దాటేస్తుంది: రాఘురామ్ రాజన్

Posted: 01/23/2019 12:46 PM IST
India to become bigger than china eventually raghuram rajan

దక్షిణాసియా దేశాల్లో అగ్రభాగన నిలిచిన చైనాను.. భారత్ అధిగమిస్తుందని పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు భారత రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్. కాలక్రమంలో ఇది సాధ్యమవుతుందని అంటున్నారు ఆయన. దక్షిణాసియా దేశాల్లో ఆర్థిక వ్యవస్థల పరంగా చైనా నెంబర్ వన్ స్థానాన్ని అక్రమించిందని అయితే రానున్న కాలంలో క్రమంగా డ్రాగన్ దేశాన్ని భారత్‌ దాటేసే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సమావేశంలో రాజన్ పాల్గొన్నారు. ‘స్ట్రాటెజిక్‌ ఔట్‌లుక్‌ ఫర్‌ సౌత్‌ఏషియా’ అనే అంశంపై ప్రసంగిస్తూ.. ప్రస్తుతం చైనా వృద్ధి రేటు నెమ్మదిస్తుందని.. అదే సమయంలో భారత్‌ వృద్ధి రేటు క్రమంగా పెరుగుతూ వస్తోందని రాజన్ గుర్తుచేశారు. రాబోయే కాలంలో ఆర్థిక వ్యవస్థ పరంగా భారత్‌ మంచి స్థానంలో నిలుచుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు.

భారత్ జీడీపీకి దాదాపుగా ఐదు రేట్లుగా వున్న చైనాను మనం దాటేయగలమా.? అన్న సందేహాలు అవసరం లేదని అన్నారు. 2017లో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2.59 లక్షల కోట్ల డాలర్ల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో భారత్‌ ప్రపంచంలో అతి పెద్ద ఆరో ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అయితే ఇదే సమయంలో చైనా జీడీపీ 12.23 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది.

అయితే నెమ్మదిస్తున్న చైనా అర్థిక ప్రగతి.. ఒక కారణం కాగా. అదే సమయంలో క్రమంగా పెరుగుతున్న భారత అర్థిక వృద్దిని పరిశీలించిన తరువాతే తాను ఈ నమ్మకాన్ని వ్యక్తం చేశానని అన్నారు. చైనా, భారత్ దేశాల మధ్య పోటీ ఇరువురికీ ప్రయోజనం కలిగిస్తుందని తెలిపారు. నేపాల్‌, పాకిస్తాన్‌ తదితర దేశాల్లో మౌలిక ప్రాజెక్టులపై చైనా పని చేస్తోందన్నారు. భవిష్యత్తులో భారత్‌ కూడా ఈ స్థాయికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles