Cyber expert claims hacked EVM’s helped BJP win ఈవీఎంలను హ్యాక్ తోనే బీజేపి విజయం: నిఫుణుడి అరోపణలు

Cyber expert claims hacked evm s helped bjp win elections in 2014

Syed Shuja cyber expert, 2014 general elections, BJP Hacking EVM, Reliance EVMs, Reliance Communication, union minister Gopinath Munde, journalist Gauri Lankesh, Kapil sibal, skype, Hyderabad, crime

Syed Shuja, a cyber expert living in the US, claimed that EVMs were hacked in the 2014 general elections in India. Shuja has been a member of the team who designed the EVMs of India.

ఈవీఎంలను హ్యాక్ తోనే బీజేపి విజయం: నిఫుణుడి అరోపణలు

Posted: 01/22/2019 11:52 AM IST
Cyber expert claims hacked evm s helped bjp win elections in 2014

2014 లోక్ సభ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా? ఈవీఎంలను హ్యాకింగ్ చేసి బీజేపీ గెలిచిందా? అంటే అవుననే అంటున్నాడు అమెరికాకు చెందిన సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను బీజేపీ ట్యాంపరింగ్ చేసిందని సయ్యద్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ కుట్రకి కేంద్రం హైదరాబాద్ అని చెప్పి మరో బాంబు పేల్చాడు. అంతేకాదు ఈ విషయం తెలిసిన సొంత పార్టీకి చెందిన అగ్రనేతను కూడా పార్టీ మట్టుబెట్టిందని ఆరోపించారు.

ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్(యూరప్)తో ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ లండన్ లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన సయ్యద్.. ఈ విషయం గురించి వివరాలను సేకరించిన కారణంగానే ఓ ప్రముఖ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేష్ ను కూడా బీజేపి హతమార్చిందని అరోపించారు. ఈ సందర్భంగా తాను ఈసీఐఎల్ రూపొందించిన ఈవీఎంల రూపకల్పన బృందంలో సభ్యుడినన్న విషయాన్ని కూడా స్పష్టంచేశారు. గత ఎన్నికలలో మిలటరీ గ్రేడ్ ఫ్రీక్వెన్సీ విడుదల చేసే మాడ్యులేటర్ తో బీజేపీ ఈవీఎంలను హ్యాక్ చేసినట్టు గుర్తించానని సయ్యద్ తెలిపాడు.

గోపీనాథ్ ముండేది హత్య.?: సయ్యద్ అరోపణ

ఈవీఎంలు హ్యాక్ చేశారని చెప్పడమే కాదు.. లండన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి స్వయంగా ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయొచ్చో చూపించాడు సయ్యద్.  హ్యాకింగ్ విషయం బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండేకు తెలుసని.. అందకనే అతనిని టార్గెట్ చేసిన నేతలు.. ఎన్నికలయ్యాక ఆయన్ని చంపేశారని తీవ్ర ఆరోపణలు చేశాడు. అంతేకాదు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య వెనుక కూడా కారణం ఈవీఎం హ్యాకింగేనని అరోపించారు.

ఈవీఎం ట్యాంపరింగ్ కు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పిన సయ్యద్ గతంలో భారత ఎన్నికల కమీషన్ ఈవీఎం ట్యాంపిరింగ్ విషయంలో విసిరిన సవాల్ ను స్వీకరించేందుకు తాను కొందరిని సిద్దం చేశానని, అయితే చివరిక్షణంలో వారు వెనకడుగు వేయడంతో చేసేదిలేక మిన్నకుండిపోయానని చెప్పాడు. అయితే తన ప్రాణానికి ప్రమాదం ఉన్న కారణంగా తాను స్వయంగా సవాల్ ను స్వీకరించలేకపోయానని అన్నారు. పైగా తాను అమెరికాకు రాజకీయ శరణార్ధిగా వెళ్లానని తెలిపాడు.

మత ఘర్షణలు పుట్టించారు:

లోక్‌సభ ఎన్నికల్లో వాడిన ఈవీఎంల నుంచి సిగ్నల్స్ వస్తున్నట్టు ఏప్రిల్ 2014లో తెలుసుకున్నట్టు సయ్యద్ షుజా చెప్పాడు. ఈ రహస్యాన్ని గుర్తించిన తమ బృందం బీజేపీని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించిందన్నాడు. బీజేపీ నేతలతో సమావేశమయ్యేందుకు ప్రయత్నించామని తెలిపాడు. హైదరాబాద్ శివార్లలో ఒక బీజేపీ నేత ఇంటికి తాము వెళ్లినట్టు వివరించాడు. అక్కడ తమపై కాల్పులు జరపగా తను గాయాలతో బయటపడినట్టు చెప్పాడు.

ఈ కాల్పుల ఘటనను కప్పిపుచ్చేందుకు హైదరాబాద్ కిషన్ గఢ్ లో మత కల్లోలాన్ని, హింసాకాండను సృష్టించారని ఆరోపించాడు. తన బృందంలోని ఇతర సహచరులను ఆ హింసలో చనిపోయినట్టు చూపించారని అన్నాడు. 2014లో ఈవీఎంలు హ్యాక్ అయ్యాయని సయ్యద్ షుజా చేసిన సంచలన ఆరోపణలు దేశ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.

కాగా, ఈ సమావేశం ద్వారా తాను ఏమీ ఆశించటంలేదన్నారు. తనకు తెలిసి ఏదీ మారబోదని అన్నారు. ఎందుకంటే ఈవీఎంలు అలాగే ఉంటాయి. ఏం జరుగుతోందో అది జరుగుతూనే ఉంటుంది. అందరూ కలిసి బ్యాలట్ పేపర్ కోసం అడిగినా కానీ.. అది సాధ్యం కాబోదని సయ్యద్ అభిప్రాయపడ్డారు. ఇక రానున్న ఎన్నికలలో ఓట్లు కొనుగోలు చేయటానికి అవసరమైనన్ని డబ్బులు బీజేపీ వద్దనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

హ్యాక్ చేయటానికి వీలు లేని ఈవీఎంలు ఉన్నాయి

''హ్యాక్ చేయటానికి వీలులేని ఈవీఎంలు వాళ్ల (ఎన్నికల కమిషన్) దగ్గర ఉన్నాయి. కానీ వాటిని వారు ఉపయోగించరు. మేం వారికి ఇచ్చిన డిజైన్.. హ్యాక్ చేయటానికి వీలులేనిది. దానిలో మోసపూరితంగా మార్పులు చేసే అవకాశమే లేదు. వైర్‌లెస్ సాయంతో దానికి కనెక్ట్ కాలేరు. ఎందుకంటే అది చాలా సంక్లిష్టమైన డిజైన్'' అని మరొక ప్రశ్నకు సమాధానంగా సయ్యద్ పేర్కొన్నారు.

సయ్యద్ తను చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపలేకపోయారు. అయితే.. ఈ విషయాన్ని ఇంకా పరిశోధించటానికి, నిగ్గుతేల్చటానికి అవసరమైతే జర్నలిస్టులకు తన వద్ద ఉన్న పత్రాలు, ఆధారాలను సంతోషంగా అందిస్తానని చెప్పారు. ఈ మాటతో సమావేశం ముగిసింది. కానీ.. జర్నలిస్టులు ఎదురుచూస్తున్నదేమీ జరగలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Syed Shuja  BJP  EVM  Reliance Communication  Gopinath Munde  Gauri Lankesh  crime  

Other Articles