Novel technology cleans water using bacteria బ్యాక్టీరియాతో నీటిశుద్ది.. భారత శాస్త్రవేత్త అవిష్కరణ

Utilizing micro organism to create a water filter that kills micro organism

Chemistry, Membrane technology, Water treatment, Water, Filtration, Water technology, Ultrafiltration, Drinking water, Membrane, membrane technology, Washington University in St. Louis, conventional reverse osmosis systems, Professor, Srikanth, Research

Researchers, led by one of Indian-origin Srikanth Singamaneni, have developed a new technology that can clean water twice as fast as commercially available ultrafiltration membranes.

బ్యాక్టీరియాతో నీటిశుద్ది.. భారత శాస్త్రవేత్త అవిష్కరణ

Posted: 01/21/2019 10:53 AM IST
Utilizing micro organism to create a water filter that kills micro organism

భారత శాస్త్రవేత్త సారధ్యంలోని బృందం అద్బుతావిష్కరణకు నాంది పలికింది. నీటిని శుద్ది చేసేందుకు ఇప్పటివరకు వున్న అల్ట్రాఫిలరేషన్ విధానానికి రెడింతలు శక్తివంతమైంది. ఇటు సమయంలోనూ, అటు పరిణామంలో కానీ రెట్టింపుస్థాయిలో శుద్దిచేసే నూతన సాంకేతిక విధానాన్ని అవిష్కరించారు. ఈ నూతన విధానంతో భారత్ సహా పలు అభివృద్ది చెందుతున్న దేశాల్లో నెలకొన్న నీటిశుద్ది సమస్యకు పరిష్కారాన్ని అందిస్తుండటంతో ఆయా దేశాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రక్షిత మంచినీటి సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్న దేశాలకు నూతన అవిష్కరణ ఉపశమనం కల్పించనుంది.

ఇంతకీ భారత సంతతి చెందిన శాస్త్రవేత్త ఎవరు.? అంటే అతనే శ్రీకాంత్ సింగమనేని. అగ్రరాజ్యం అమెరికాలోని సెయింట్ లూయిస్ లో ఉన్న వాషింగ్టన్ యూనివర్సిటీలో ఆయన ఫ్ఱెఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. శ్రీకాంత్ సారథ్యంలోని అమెరికాలోని శాస్త్రవేత్తల బృందం నీటిని శుద్దిపర్చేందుకు సరికొత్త సాంకేతిక విధానాన్ని అభివృద్ధి చేసింది. నీటిలో బ్యాక్టీరియా వృద్ది చెందకుండా బ్యాక్టీరియానే ఉపయోగించి సరికొత్త మెంబ్రేన్ (సన్నని పొర) టెక్నాలజీని అభివృద్ధి చేసింది.

ప్రస్తుతం ప్రతీ పదిమందిలో ఒకరికంటే ఎక్కువ మంది కనీస నీటి సౌకర్యం లేక, రక్షిత మంచినీరు దొరక్క అలమటిస్తున్నారు. 2025 నాటికి సగం మంది జనాభా నీళ్ల కరవుతో అల్లాడే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. శ్రీకాంత్ బృందం అభివృద్ది చేసిన అల్ట్రాఫిల్టరేషన్ మెంబ్రేన్‌లో గ్రాఫైన్ ఆక్సైడ్, బ్యాక్టీరియల్ నానోసెల్యులోజ్ ఉపయోగిస్తారు. ఇది చాలాకాలం మన్నిక కలిగి ఉండడమే కాక, పర్యావరణ సహితంగా ఉంటుందని శ్రీకాంత్ బృందం వివరించింది. శ్రీకాంత్ బృందం అభివృద్ది చేసిన మెంబ్రేన్ టెక్నాలజీ నీటిలో బ్యాక్టీరియా అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. అలాగే, నీటిలోని హానికారక మైక్రోఆర్గాజమ్స్ ను నియంత్రిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles