Delhi court grants bail to Lalu Prasad Yadav ఐఆర్సీటీసీ కేసులో ఆర్జేడీ అధినేత లాలూకు బెయిల్

Irctc scam delhi court grants bail to lalu prasad yadav in cbi case

lalu prasad yadav, lalu yadav bail, irctc scam, cbi, delhi court, Rabri Devi, Tejashwi Yadav, Delhi HC, Patalia House Court, Bihar, politics

A Delhi court on Saturday granted regular bail to RJD leader and former Union Railway Minister Lalu Prasad Yadav in connection with the IRCTC scam case filed by the CBI.

ఐఆర్సీటీసీ కేసులో ఆర్జేడీ అధినేత లాలూకు బెయిల్

Posted: 01/19/2019 07:21 PM IST
Irctc scam delhi court grants bail to lalu prasad yadav in cbi case

ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు బెయిల్‌ మంజూరైంది. ఐఆర్‌సీటీసీ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న లాలూకు ఢిల్లీలోని పటియాల కోర్టు ఇవాళ బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచికత్తుతో రెగ్యూలర్‌ బెయిల్‌కు న్యాయస్థానం అనుమతిచ్చింది. ఇదే కేసులో లాలూ భార్య రబ్రీ దేవి, ఆయన కుమారుడు, బిహార్ మాజీ మంత్రి తేజస్వీ యాదవ్‌కు మధ్యంతర బెయిల్‌ గడువును జనవరి 28 వరకు పొడిగించింది.

తొలుత ఈ కేసుకు సంబంధించి ఆర్జేడీ అధినేతకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను జనవరి 28వరకు కోర్టు పొడిగించింది. రెగ్యులర్‌ బెయిల్‌పై జనవరి 28న తీర్పు ప్రకటిస్తామని వెల్లడించింది. అయితే నేటి మధ్యాహ్నం లాలూ పిటిషన్‌ను మరోసారి విచారించిన పటియాలా కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ ఇచ్చేందుకు అంగీకరించికంది. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ రాజధాని రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కేంద్ర రైల్వే శాఖమంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్‌సీటీసీ హోటళ్ల నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో సీబీఐ ఆయనపై అభియోగాలు మోపింది. హోటళ్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని తేలడంతో 2006లో సీబీఐ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో లూలూ ఫ్యామిలీకి భారీ మొత్తంలో ముడుపులు అందాయని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం లాలూ రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles