Ahmedabad restaurants log off from Swiggy స్విగ్గీపై తిరుగుబాటు.. ఉబర్ ఈట్స్, జొమాటోలే నెక్ట్స్ టార్గెట్..

Restaurant owners to stop taking orders from swiggy in ahmedabad

Saurabh Patel, AHMEDABAD, Gujarat, Surat, Vadodara, restaurants, Swiggy, Zomato, Uber Eats, eateries, Rohit Khanna, Swiggy orders, Swiggy news, Swiggy Gujarat, Swiggy Ahmedabad

Nearly 750 restaurants and eateries' operators in Ahmedabad have decided to boycott the online food delivery platform, Swiggy. If Zomato and Uber Eats do not renegotiate and reduce their commission, they will also face a boycott from January 14.

స్విగ్గీపై తిరుగుబాటు.. ఉబర్ ఈట్స్, జొమాటోలే నెక్ట్స్ టార్గెట్..

Posted: 01/11/2019 04:20 PM IST
Restaurant owners to stop taking orders from swiggy in ahmedabad

ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీపై హోటల్, రెస్టారెంటు యాజమాన్యాలు తిరుగుబాటు బావుటాను ఎగురవేశాయి. తాము కస్టమర్లను పెంచుకునేందుకు నాణ్యత, రుచిలో ఎక్కడ రాజీ పడకుండా అహార పధార్థాలను తయారు చేస్తుంటే.. వినియోగదారులను పెంచుకునే క్రమంలో ఫుడ్ డెలివరీ సంస్థలు వారికి రాయితీలను ప్రకటిస్తూ.. తమపై పెత్తనం చేస్తూ.. కమీషన్లను పెంచాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయని హోటల్, రెస్టారెంటు యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాము ముందుగా స్విగ్గీ సేవలను అందించలేమని తేల్చిచెప్పారు. ఇవాళ్టి (జనవరి 11) నుంచి స్విగ్గీ సర్వీసులకు స్వస్తి పలికారు.

గుజరాత్ హోటల్ అండ్ రెస్టారెంట్స్ నుంచి 22 శాతం కమిషన్‌ను స్విగ్గీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అసోసియేషన్ సభ్యులు సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకుని దానిని అమలు చేస్తున్నారు. కాగా, జొమాటో, ఉబర్ ఈట్స్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చునని ప్రకటించింది. వ్యాపారం నడవడం సంగతి పక్కనపెడితే భారీగా కమిషన్ డిమాండ్ చేస్తే తమకు లాభం లేదని భావించారు. కమిషన్ మరీ ఎక్కువ అడుగుతున్నారు పునరాలోచించాలని సూచించగా స్విగ్గీ అందుకు ఒప్పుకోలేదు. జొమాటో మాత్రం ఆలోచించి తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని చెప్పడంతో వీరి కాంట్రాక్ట్ పునరుద్ధరించనున్నారు.

ఇదిలా వుండగా, జొమాటో, ఉబర్ ఈట్స్ సంస్థలు కూడా తమ నిర్ణయాలను జనవరి 13లోగా వెల్లడించాలని తెలిపామని, వారు కమీషన్ల విషయంలో పునరాలోచన చేసి తమ నిర్ణయాలను ప్రకటించని పక్షంలో జనవరి 14 నుంచి వారికి కూడా సేవలు నిలిపేయబడతాయని హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేంద్ర సోమానీ సూచించారు. మంత్రి సౌరభ్ పటేల్ సమక్షంలోనే ఫుడ్ డెలివరీ సంస్థలతో అధికారికంగా చర్చలు జరిగిన తరువాత ఆయన మాట్లాడుతూ.. ఓవైపు వినియోగదారుల ఫోన్ నెంబర్ వివరాలను దుర్వినియోగం చేస్తూ, మరోవైపు అధికంగా కమీషన్లు ఆశించడం మంచిది కాదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saurabh Patel  AHMEDABAD  Gujarat  Surat  Vadodara  restaurants  Swiggy  Zomato  Uber Eats  

Other Articles