Aadhaar To Be Linked With Driving Licence Soon ‘‘ఆధార్ తో ఇక డ్రైవింగ్ లైసెన్సుల అనుసంధానం’’

Aadhaar may be linked with driving licence ravi shankar prasad

Data Protection Law, Ravi Shankar Prasad, law and justice ministry, electronics and information technology, electronics and information technology ministry, Union minister Ravi Shankar Prasad, cyber safety, data protection

While applauding the role of innovations in communication technology, Union minister for law and justice and electronics and information technology Ravi Shankar Prasad informed that digital payments have surged to eight folds in the last five years to Rs 2,070 crore.

‘‘ఆధార్ తో ఇక డ్రైవింగ్ లైసెన్సుల అనుసంధానం’’

Posted: 01/07/2019 09:59 AM IST
Aadhaar may be linked with driving licence ravi shankar prasad

సామాన్యుల హక్కైన ఆధార్ కార్డుతో దేశపౌరుల వ్యక్తిగత సమాచారం పొందుపర్చని నేపథ్యంలో దీనిని గోప్యంగా ఉంచుకోవడం వారి ప్రాథమిక హక్కని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాయపడిన విషయం తెలిసిందే, ఈ క్రమంలో అధార్ కార్డు వివరాలను కేవలం ప్రభుత్వ పథకాలకు మాత్రమే వర్తింపజేయాలని ఇది పథకాలు పక్కదారి పట్టకుండా చేస్తుందని కూడా అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. కాగా బ్యాంకులు, ప్రైవేటు టెలికాం సర్వీసుల ఎట్టి పరిస్థితుల్లో ఆదార్ వివరాలను సేకరించరాదని, ఇప్పటికే సేకరించిన సమాచారాన్ని పూర్తిగా తొలగించాలని కూడా అదేశాలు జారీ చేసింది.

ఇక ఈ క్రమంలో ఇటు కేంద్రప్రభుత్వం కూడా ఆధార్ వివరాలు అడిగితే కోటి రూపాయల వరకు జరిమానా విధించేందుకు నూతన చట్టాన్ని కూడా తీసుకురానుంది. ప్రభుత్వ పథకాలకు కాకుండా మరే ఇతర సంస్థలు ఆధార్ కార్డు వివరాలు, లేక నెంబరు పోందుపర్చాలని బలవంతం చేసినా ఆయా సంస్థలకు కోటి రూపాయల వరకు జరిమానా విధించే కొత్త చట్టాన్ని కూడా తీసుకురానుంది కేంద్రం. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డును ఇకపై రవాణశాఖ అనుసంధానం కావాలని కొత్త ప్రణాళికతో ముందుకువస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్ తో ‘ఆధార్’ అనుసంధానాన్ని తప్పనిసరి చేసే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.

106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్సీ) లో ఆయన మాట్లాడుతూ, ఇందుకు సంబంధించిన బిల్లు పార్లమెంట్ లో పెండింగ్ లో ఉందని, త్వరలోనే లైసెన్స్ తో ‘ఆధార్’ అనుసంధానం తప్పనిసరి చేయబోతున్నామని అన్నారు. ‘ఆధార్’తో లైసెన్స్ అనుసంధానం వల్ల మంచి ప్రయోజనం వుందని, ఈ పద్ధతి అమల్లోకి వస్తే డూప్లికేట్ లైసెన్స్, నకిలీ లైసెన్స్ లకు అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. కాగా, పంజాబ్ లోని జలంధర్ లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీలో ఐఎస్సీ నిర్వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles