Polavaram project enters Guinness Record గిన్నిస్ రికార్డు పుట్టలోకి ఎక్కిన పోలవరం ప్రాజెక్డు..

Polavaram project enters guinness book of world record for concrete pouring

polavaram project, guinness book of world record, polavaram project enters guinness book of world record, Navayuga company, concrete work, chandrababu naidu, concrete pouring world record, andhra pradesh

The Polavaram project in Andhra Pradesh on Monday entered the Guinness Book of World by pouring 32,100 cubic metres of concrete in 24 hours. The concrete work to make the spillway began at 8 am on Sunday and concluded at 8 am this morning.

గిన్నిస్ రికార్డు పుట్టలోకి ఎక్కిన పోలవరం ప్రాజెక్డు..

Posted: 01/07/2019 10:52 AM IST
Polavaram project enters guinness book of world record for concrete pouring

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌ ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ రికార్డు పోలవరం ప్రాజెక్టును ఏకంగా గిన్నిస్ బుక్ పుట్టల్లోకి ఎక్కేలా చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న కాంక్రీట్‌ పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో దర్పణం పట్టేందుకు ఈ రికార్డే ఓ కొలమానంలా నిలిచింది. ప్రాజెక్టు కాంక్రీట్ పనులు జరుగుతున్న తీరును పరిశీలించిన గిన్నిస్ రికార్డు బుక్ అధికారులు.. వరల్డ్‌ రికార్డులో స్థానం కల్పించారు.

24 గంటల వ్యవధిలో కార్మికులు కాంక్రీట్ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకల్లా 32,100 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు పూర్తి చేశారు. ఎముకలు కొరికే చలిలోనూ కార్మికులు విరామం లేకుండా ఈ ఘట్టంలో పాల్గొన్నారు. ప్రతి గంటకు సగటున 1300 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను ఫిల్లింగ్‌ చేశారు. అర్ధరాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగుల్లోనూ పనులు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల వరకు ఈ పనులు ప్రారంభించారు. దాదాపు 4 వేల మంది సిబ్బంది ఇందులో పాలుపంచుకున్నారు.

2017లో యూఏఈలో ఓ టవరు నిర్మాణంలో భాగంగా 24 గంటల్లో 21,580 ఘనపు మీటర్ల కాంక్రీటు వేశారు. ఆ రికార్డును పోలవరం తాజాగా అధిగమిచింది. 16 గంటల్లోనే ఈ రికార్డును అందుకుంది. రికార్డు అనంతరం కూడా పనులు కొనసాగాయి. నవయుగ సంస్థ ఈ నిర్మాణాన్ని చేపట్టింది. పోలవరం ప్రాజెక్ట్‌ ఈ రికార్డును సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు. అధికారులను అభినందించారు. పోలవరం ప్రాజెక్ట్‌ను ఆయన సోమవారం మధ్యాహ్నం సందర్శించనున్నారు. గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధుల చేతుల మీదుగా అధికారికంగా రికార్డు పత్రాలను అందుకోనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles